BigTV English

Snake Hulchul in School: పాఠశాలలో నాగుపాము కలకలం.. విద్యార్థుల్లో భయం భయం

Snake Hulchul in School: పాఠశాలలో నాగుపాము కలకలం.. విద్యార్థుల్లో భయం భయం

Snake Hulchul in government School: విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము ప్రత్యక్ష్యమైంది. ఈ పామును చూసిన విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులకు కళ్లముందే పాము కనిపించడంతో భయం పట్టుకుంది. వివరాల ప్రకారం.. విశాఖలోని గాజువాక ములగాడలో జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కనిపించింది. దీంతో వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.


విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వెళ్లి చూడగా పెద్ద పాము కనిపించింది. ఏం చేయాలో ఉపాధ్యాయులకు అర్థం కాలేదు. సమీపంలో నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. అనంతరం స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.

వెంటనే తరగతి గదిలోకి దూరిన నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. తొలత ఆ పాము బుసలు కొడుతూ భయంకరంగా కనిపించింది. అయితే స్నేక్ సొసైటీ సభ్యుడు ఎట్టకులకు ఆ పామును చాలా చాకచక్యంగా పట్టుెకొని బంధించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్తూ దారి మధ్యలో ఓ అడవిలో వదిలిపెట్టడంతో ఆ పాము జారుకుంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: రేపటి నుంచే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు, రూ.100తో రూ.5 లక్షల బీమా : సీఎం చంద్రబాబు

ఈ మేరకు స్నేక్ సొసైటీ సభ్యులు పాముల గురించి పలు విషయాలు చెప్పారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే చంపకూడదని సూచించారు. పాములు కనిపిస్తే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాలన్నారు. అయితే విద్యార్థులకు మాత్రం పాము భయం వీడడం లేదు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×