BigTV English

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Pragathi: ఆ నటుడు అసభ్యకరంగా తాకాడు.. ప్రగతి ఎమోషనల్ కామెంట్స్..!

Pragathi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రగతి (Pragathi)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏమైంది ఈవేళ అనే సినిమాలో నటించి ఏకంగా ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం కూడా సొంతం చేసుకుంది. ప్రగతి నటిగానే కాకుండా 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె కాంస్య పథకం కూడా సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కరోనా సమయంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. సినిమా అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా ఉండలేక జిమ్ కి వెళ్తూ అక్కడ వర్కౌట్స్ చేస్తూ పలు రకాల వీడియోలను ఫోటోలను షేర్ చేసింది. ఈ వయసులో కూడా ఇంత స్ట్రాంగ్ ఏంటి అంటూ కామెంట్లు కూడా చేశారు నెటిజన్స్.


కార్టూన్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన ప్రగతి..

ఇకపోతే ఈమధ్య కాలంలో తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె సినిమా ఏదైనా సరే కచ్చితంగా ప్రగతి ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా కార్టూన్ పాత్రలకి కూడా ఈమె డబ్బింగ్ చెప్పింది అంటే ఎవరైనా నమ్మగలరా..? అలాగే ఒక యాడ్ లో కూడా నటించింది ప్రగతి. ఆ యాడ్ చూసిన ఒక కోలీవుడ్ డైరెక్టర్ కే.భాగ్యరాజ్ ఈమె అందానికి , నటనకు ఆకర్షితుడై వీట్ల విశేషంగా అనే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఏడు సినిమాలు తమిళ్ లో, ఒక మలయాళం సినిమాలో కూడా నటించడం జరిగింది. కెరియర్ పీక్స్ లో ఉన్నట్లుగానే వృత్తికి కాస్త బ్రేక్ ఇచ్చిన ఈమె వివాహం చేసుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా నటిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది.


నమ్మినవాడే మోసం చేశాడు..

ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ప్రగతి మాట్లాడుతూ.. ఒక నటుడు చేసిన ఒక పనికి నేను ఇప్పటికి ఆశ్చర్యానికి గురవుతూనే ఉంటాను. అసలు ఆ సమయంలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ నటుడు నాతో చాలా పద్ధతిగా ఉండేవాడు. అయితే ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఆ క్షణం సెట్లో ఉన్నట్టుండి అందరి ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. నమ్మిన వ్యక్తి మోసం చేశాడనిపించింది. ఎంతో బాధపడ్డాను. ఆ బాధతో భోజనం కూడా చేయాలనిపించలేదు. అంతేకాదు ఆరోజు షూటింగ్ కూడా నేను వెళ్లలేకపోయాను. తీవ్ర మానసిక వేదన అనుభవించాను అంటూ ప్రగతి తెలిపింది.

చివరికి అతడే నాపై పొగరుబోతు అనే ముద్ర వేశాడు..

అంతేకాదు అతడిని తీసుకెళ్లి క్యారవాన్లో కూర్చోబెట్టి మరీ మాట్లాడాను. నాతో ఎందుకు అలా ప్రవర్తించారు అని అడగ్గా, అతను మాత్రం నీళ్లు మింగాడు. నేను తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అసలు పరిస్థితి ఎలా ఉండేది.. మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా అని కూడా ప్రశ్నించాను. దానితో అతడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత అందరితో నాకు పొగరు అని , ఆటిట్యూడ్ అని, నాపై నెగటివ్ రూమర్స్ సృష్టించి నా కెరియర్ను నాశనం చేశాడు అంటూ ఎమోషనల్ అయింది ప్రగతి.

Related News

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Big Stories

×