BigTV English
Advertisement

Software Engineer Suicide: తిరుపతిలో దారుణం, అన్న కుటుంబాన్ని చంపి, టెక్కీ సూసైడ్

Software Engineer Suicide: తిరుపతిలో దారుణం, అన్న కుటుంబాన్ని చంపి, టెక్కీ సూసైడ్

Software Engineer Suicide: వారిద్దరు అన్నదమ్ములు. తమ్ముడు మోహన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. డబ్బుల కు కొదవలేదు. అతడి అన్న రాజకీయ పార్టీలో పని చేస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా అన్నదమ్ము లిద్దరు చర్చించుకునేవారు. అప్పటివరకు కూర్చొని మద్యం సేవించారు. అన్న బయటకు వెళ్లగానే..  తమ్ముడు, వదిన, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి పొడిచి దారుణంగా చంపేశాడు. చివరకు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసు కున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


తిరుపతిలోని పద్మావతి నగర్‌లో ఉంటోంది టీవీ దాస్ ఫ్యామిలీ. దాసుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా రు. పెద్ద కూతురికి 13 ఏళ్లుకాగా, మరో అమ్మాయికి పదేళ్లు. వీరికి ఓ తమ్ముడు మోహన్ ఉన్నాడు. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల కిందట మోహన్‌కు అన్నావదినలే మ్యారేజ్ చేశారు. మరి ఏమైందోగానీ మరుసటి ఏడాది దంపతులు విడిపోయారు. రీసెంట్‌గా సెకండ్ మ్యారేజ్ చేశారు.. ఆ అమ్మాయి కూడా మోహన్‌కు దూరంమైంది. దీంతో టెక్కీ మానసికంగా లోలోపల కుంగిపోయాడు.

సీన్ కట్ చేస్తే.. బుధవారం రాత్రి ఇంట్లో దాస్- తమ్ముడు మోహన్ మద్యం సేవించారు. ఆ మత్తులో దాస్ బయటకు వెళ్లాడు. బయట నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, వదిన ను, ఇద్దరు ఆడపిల్లలను పదునైన కత్తితో పొడిచి చంపేశాడు సాప్ట్‌వేర్ ఇంజనీర్. వారంతా రక్తం మడుగులో పడివున్నారు. వారి మృతదేహాలను తరలించేందుకు ప్రయత్నం చేశాడు. ఇరుగుపొరుగువారు గమనించి గట్టిగా కేకలు వేయడంతో మోహన్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.


ALSO READ: ఏలూరు స్కూల్‌లో దారుణం.. తోటి విద్యార్థిపై పెట్రోల్ పోసి.. ఆ తర్వాత

ఈలోగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే అన్న కుటుంబం రక్తపు మడుగులో పడివుంది. మోహన్ ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మోహన్ అన్న దాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు. అన్న-తమ్ముడి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఫ్యామిలీ సభ్యులను హత్య చేయాలని తమ్ముడికి అన్న సలహా ఇచ్చాడా? లేక మద్యం మత్తులో అనుకోకుండా జరిగిందా? ఇలా రకరకాల ప్రశ్నలు స్థానికులను వెంటాడుతున్నాయి.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×