BigTV English

Jagan more trouble: చంద్రబాబు సర్కార్ నిర్ణయం, చిక్కుల్లో జగన్, రేపోమాపో ఈడీ..

Jagan more trouble: చంద్రబాబు సర్కార్ నిర్ణయం, చిక్కుల్లో జగన్, రేపోమాపో ఈడీ..

Jagan more trouble: తెలుగు రాష్ట్రాలను లిక్కర్ స్కామ్‌లు కుదిపేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బెయిల్ రాలేదు. తాజాగా ఏపీలో లిక్కర్ స్కామ్ బయటకువచ్చింది. మాజీ సీఎం జగన్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ ఉచ్చులో చిక్కుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయిని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులోకి ఈడీ దిగితే జగన్‌ పనైపోయినట్టేని అంటున్నారు.


వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. మద్య విధానం వల్ల గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వానికి 18000 వేల కోట్ల మేరా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెల్లడించింది. రిటైల్ షాపుల ద్వారా 99 వేల 413 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాదిలో మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేశారని తేల్చిం ది. మొత్తం చెల్లింపుల్లో ఇది 0.66 శాతం మాత్రమే.

ఈ వ్యవహారంలో ఎంతమేరా అవినీతి జరిగిందనేది తెలియాలంటే లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయా లు వెలుగులోకి వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. వీటిపై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. అసలే చంద్రబాబునాయుడు సపోర్టుతో కేంద్రప్రభుత్వం నడుస్తోంది. ఈ సమయంలో ఏపీ లిక్కర్ కేసు ఈడీకి అప్పగిస్తే మాజీ సీఎం జగన్‌కు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటిని ఫ్యాన్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్న వాదనలూ లేకపోలేదు.


గత ప్రభుత్వ లోపాలు ముందుగానే పసిగట్టిన మాజీ సీఎం జగన్ పథకం ప్రకారమే చంద్రబాబు సర్కార్‌పై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారని అంటున్నారు. రేపటి రోజున సీఐడీ నేతలను అదుపులోకి తీసుకున్నా రెడ్‌బుక్ వల్లే తమను ఇబ్బంది పెడుతున్నారని పైకి చెప్పడానికి వైసీపీకి ఇదొక పాయింట్‌గా చెబుతున్నా రు.

ALSO READ: ‘రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..?’

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఆఫీసు నుంచి పత్రాలు చోరీ చేశారన్న కారణంతో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణలో కీలక సమాచారం సీఐడీకి లభించిందని, దాని ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్టేట్‌మెట్ ఇచ్చారన్నది రాజకీయ నిఫుణులు మాట. లిక్కర్ కేసు విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×