Shivani Reels: రీల్స్ అంటే టైంపాస్ ఒక్కటే కాదు.. తమలోని టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసే ఎలిమెంట్ కూడా! సోషల్ మీడియా వేదికగా.. తన టాలెంట్‌తో తనకు తానుగా గుర్తింపు తెచ్చుకుంటోంది.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగికి చెందిన శివానీ. చక్కటి అభినయం, అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు, హావభావాలతో ఆకట్టుకుంటోంది.
బేబీ హనీ శివానీ పేరుతో.. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 11 వందలకు పైగా రీల్స్ చేసింది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్‌తో నెటిజన్ల ముందుకొస్తుంది. తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ట్రెండింగ్ ఉండే పాటేదైనా.. తన స్టైల్‌లో స్టెప్పులేసి అదరగొడుతోంది శివానీ. ఇటీవల పాపులర్ అయిన ఇరుముడి మూవీలోని.. కట్టుకట్టు ఇరుముడి పాటతో పాటు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని బటర్ ఫ్లై పాటలకు చేసిన రీల్స్‌కు.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. పెద్ద సినిమాలోని చికిరీ పాటకు శివానీ చేసిన డ్యాన్స్ చాలామందిని అట్రాక్ట్ చేసింది. ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ప్రత్యేకంగా అభినందించారు.
శివానీ టాలెంట్ డ్యాన్స్‌కే పరిమితం కాలేదు. కామెడీ రీల్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది. శివానీ టాలెంట్ వెనుక తండ్రి ధర్మరాజు శెట్టి ప్రోత్సాహం ఉంది. కూతురి ఆసక్తిని గుర్తించిన ఆయన రీల్స్ మేకింగ్‌లో సహకరిస్తున్నారు. చిన్నారి అభిరుచికి ప్రోత్సాహం అందిస్తూ ఆమె ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న శివానీకి భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలున్నాయి. పెద్దయ్యాక డ్యాన్స్ రంగంలో మరింత రాణించడంతో పాటు డాక్టర్‌గా ఎదిగి ప్రజలకు సేవ చేయాలనేదే తన ఆశయమని శివానీ బిగ్ టీవీకి తెలిపింది.
వయసు చిన్నదే కానీ ఆశయాలు మాత్రం పెద్దవి. చదువుకుంటూనే కెమెరా ముందు తన ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు కోసం అడుగులు వేస్తోంది ఈ బిర్లంగి చిన్నారి. తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రతిభకు పదును పెట్టే సాధన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే చిన్న వయసులోనూ అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తోంది శివానీ.
Also read: కూటమి ప్రభుత్వంపై కామెంట్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే?