E-Paper
Advertisement

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెర నటుడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి అనంతరం వెండి తెర సినిమాలలో కమెడియన్ గా అవకాశాలు అందుకున్న వారిలో రంగస్థలం మహేష్ ఒకరు. మహేష్ అచంట(Mahesh Achanta) పలు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు కాని రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించి సందడి చేశారు. ఈ పాత్ర ద్వారా ఈయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా తన పేరు ముందు కూడా రంగస్థలం చేరిపోవడంతో రంగస్థలం మహేష్ గా అందరికీ గుర్తుండిపోయారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న మహేష్ అచంట తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు.

పిలిపించి మరీ గుంటూరు కారంలో అవకాశం..

తాజాగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ అచంట తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.. తాను సినిమాల పరంగా చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది చూడను మనకు ప్రతినెలా షూటింగ్స్ ఉండాల్సిందే అందుకు అనుగుణంగానే ఏ అవకాశం వచ్చినా వదులుకోనని తెలిపారు. ఇలా తాను నటించిన సినిమాలు చూసి స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిపించుకొని మరి తనకు గుంటూరు కారం (Gunturukaaram)సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు.

జాతి రత్నాలు సినిమా డైలాగ్స్ అంటే ఇష్టం..

Advertisement

మహేష్ బాబు గారు జాతి రత్నాలు సినిమా చూశారట అందులో నేను చెప్పిన డైలాగ్స్ మహేష్ బాబుకి విపరీతంగా నచ్చాయని అందుకే తనని పిలిపించుకొని మరి గుంటూరు కారం సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో జాతి రత్నాలు సినిమాలో నీ డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఒకసారి చెప్పరా అంటూ తన చేత చెప్పించుకున్నారని మహేష్ అచంట ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక చిన్నప్పుడు మహేష్ బాబు చెప్పే ఒక ఫోన్ నెంబర్ కు కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసే వాళ్ళమని, అవతల వాళ్ళు మాట్లాడటంతో మహేష్ బాబు మాట్లాడుతున్నారని ఫీల్ అయ్యే వాళ్ళం అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఇలా కాయిన్ బాక్స్ ద్వారా మహేష్ బాబుతో మాట్లాడాలనుకున్న నేను స్వయంగా ఆయనే పిలిచి మరి నాకు తన గుంటూరు కారం సినిమాలో అవకాశం కల్పించడం అనేది తాను ఎప్పటికీ మర్చిపోలేని విషయం అంటూ ఈ సందర్భంగా మహేష్ అచంట చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన పలు ప్రాజెక్టులలో ఎంతో బిజీగా ఉన్నారని తన కెరియర్ కి సంబంధించిన విషయాలను కూడా తెలిపారు.

Also Read: ఫస్ట్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగు పెట్టిన శివ కుమార్…

Related News

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

ఫస్ట్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగు పెట్టిన శివ కుమార్…

Big Stories

Advertisement
×