E-Paper
Advertisement

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!
Advertisement

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సీట్ల విషయంలో కూటమి మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. టీడీపీ-జనసేన మధ్య  కేవలం మేయర్ సీట్లపై ప్రతిష్టంభన నెలకొంది. బుధవారం ఉదయం 10 గంటలకు మరోసారి జనసేన నేతలు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈసారి ఫైనల్ కాకుంటే ఎవరికివారు పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఏపీలోని కూటమి పార్టీల మధ్య ఇంకా సీట్లు సర్దుబాటు కాలేదు. ముఖ్యంగా మేయర్ సీట్ల విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. అరడజను మేయర్ సీట్లు, పాతిక మున్సిపాలిటీలు ఇవ్వాల్సిందేనని జనసేన పట్టుబడుతోంది. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు

Advertisement

గడిచిన రెండురోజులుగా టీడీపీ-జనసేన మధ్య మేయర్, మున్సిపాలిటీల గురించి ఎగతెగని చర్చలు జరుగుతున్నాయి. మేయర్ స్థానాలపై ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు మరోసారి భేటీ కానున్నారు నేతలు. చంద్రబాబు సమక్షంలో సీట్ల సర్దుబాటుపై తుది చర్చలు జరగనున్నాయి. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు అర్ధరాత్రి వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ భేటీలో సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చేనా అనేది సందేహంగా మారింది.

జనసేన కోరికలు ఏంటి? 40 శాతంతో పదవులా?

జనసేన 6 కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలు కోరినట్టు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. నగర పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 40.1 శాతం వాటాతో 2,091 పదవులను కేటాయించాలని జనసేన ప్రధాన ప్రతిపాదన. టీడీపీ మాత్రం 4 కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు ఇస్తామని చెబుతోంది. ఎక్కడెక్కడ అనేది అసలు సమస్యగా మారింది. ఇక బీజేపీకి ఓ కార్పొరేషన్, 10 మున్సిపాలిటీలు దాదాపు ఓకే అయినట్టు సమాచారం. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత సంయుక్త ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ: ‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

మంగళవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఆ సమయంలో వారిపై పవన్ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సమాచారం లేకుండా రిజర్వేషన్ల విషయం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. రిజర్వేషన్ల అంశం ఈసీ చేతిలో ఉంటుందని, టీడీపీకి ఏ మాత్రం సంబంధం లేదని నేతలు అన్నట్లు తెలుస్తోంది. చివరకు ఈ వ్యవహారాన్ని నాదెండ్ల, లింగమనేనికి అప్పగించినట్టు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి పవన్ కల్యాణ్ వెళ్లిపోయినట్టు సమాచారం. మేయర్ సీట్లు రిజర్వ్డ్ కావడంతో నేతలు కాదు, చివరకు దిగువ స్థాయి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం చర్చలు కొలిక్కి వస్తాయా? లేవా అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

 

Related News

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

విశాఖ మేయర్ పీఠం కోసం తీవ్ర ఉత్కంఠ పోరు.. టీడీపీ, వైసీపీలో వినిపిస్తున్న పేర్లు ఇవే?

Big Stories

Advertisement
×