E-Paper
Advertisement

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన
Advertisement

Bihar: బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్నఓ పడవ గంగానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

బీహార్‌లోని పడవ బోల్తా, 14 మంది మృతి

బిహార్‌లోని వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. పదుల సంఖ్యలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ.. గంగానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళలు-చిన్నారులతోపాటు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాఘోపూర్ నియోజకవర్గంలోని రామ్‌పూర్ శ్యామ్‌చంద్ గ్రామ సమీపంలో రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులంతా విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు పడవలో వెళ్తున్నట్లు సమాచారం.

మంగళవారం రాత్రి ఘటన, రంగంలోకి సహాయక బృందాలు

Advertisement

ఘటన సమయంలో పడవలో దాదాపు 20 మంది వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఆ పడవ ఘటనలో తొలుత 8 మంది మృతి చెందినట్టు నివేదికలు వచ్చినప్పటికీ అది కాస్త 14కు చేరింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికార యంత్రాంగం అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బయటపడిన పలువుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ సొంత నియోజకవర్గంలో ఘటన

మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు. ఘటన గురించి తెలియగానే ఆర్డీజే నేత, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తేజస్వి యాదవ్ ప్రజలు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. చాలా బాధాకరమని ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ప్రాణ నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే తేజస్వి యాదవ్, బుధవారం పాట్నాకు రానున్నారు. అక్కడి నుంచి రాఘోపూర్‌కు వెళ్లనున్నారు.

Related News

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌.. మంత్రులకు వార్నింగ్‌!

క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. మార్జిన్ 30 శాతానికి కట్!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

Big Stories

Advertisement
×