E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?
Advertisement

Intinti Ramayanam Today Episode October 14th: పోలీసులు అవనీని అలాగే కమల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తారు. అయితే అక్కడే ఉన్న పల్లవి అవని అరెస్టు అయింది అని చాలా సంతోషంగా ఉంటుంది. కమల్ మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తలే చేసావా మేమేం అన్యాయం చేసాం మీకు అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్న ఎస్ఐ పోలీసులు ముందే నువ్వు నీ పెళ్ళాం మీద ఇలా మాట్లాడుతున్నావు.. అంటే ఇంకా మేము లేకుండా ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నావో అర్థమవుతుంది వీళ్ళని సెల్ లో పెట్టండి అని అంటారు. కన్నయ్య నువ్వు సైలెంట్ గా ఉండు ఏం జరిగితే అది జరిగింది అని అవని అంటుంది. ఇక అవనిని అలాగే కమల్ ని వేరే వేరే సెల్ లో పెడతారు. అవని దగ్గరికి వచ్చిన పల్లవి నువ్వు ఇలా అవుతావని అస్సలు ఊహించలేదు కదా.. నన్ను ఇంట్లో నుంచి పంపించేసావు కదా అందుకే నువ్వు ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టాలి అని పల్లవి అంటుంది. ఈ పాపం పండే రోజు కూడా దగ్గర పడింది దానికి కూడా నువ్వు అనుభవిస్తావు అని అవని అంటుంది. పల్లవి నా భర్త మంచోడే మా అక్క అంతా చేసింది కాబట్టి తనని అస్సలు వదలొద్దు అని ఎస్ఐకి గిఫ్ట్ కూడా ఇస్తుంది.

అవనికి దిమ్మతిరిగే షాక్..

అవని లేదు అని ఆరాధ్య బాధ పడిపోతూ ఉంటుంది. ఇక పార్వతీ శ్రియ నువ్వు ఇలా బాధపడితే అమ్మ కూడా బాధపడుతున్న అమ్మ త్వరలోనే వస్తుంది. మీ బాబాయి లాయర్ కదా తీసుకొని వస్తాడు అని అంటుంది శ్రేయ. అయితే ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన శ్రీకర్ అక్షయలకు పోలీసులు కేసు ఫైల్ ని చూపిస్తారు. శ్రియ పల్లవికి ఫోన్ చేసి మీ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి. కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు దేవుడనేవాడు ఉంటే నువ్వు కచ్చితంగా అనుభవిస్తావు అని అంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి..

Advertisement

అవని నీ పోలీసుల అరెస్ట్ చేశారు అని తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా అందరూ బాధపడిపోతూ ఉంటారు. ఇక శ్రీకర్, అక్షయ్ పోలీస్ స్టేషన్ కి వస్తారు అయితే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడటానికి అని పర్మిషన్ తీసుకొని వచ్చిన శ్రీకర్ కి పోలీసులు ఒక్కొక్క షాక్ ఇస్తూ వస్తారు. ఇక అవనికి జ్వరం అని చెప్పి అక్షయ్ తనకి మందులు తీసుకుని వస్తాడు. అవని నీకు జ్వరంగా ఉంది కదా ఈ మందులు వేసుకో అని తెచ్చి ఇస్తాడు. అయితే ఆ మందులు వేసుకున్న దానికి అవని ఒప్పుకోదు పైనున్న మందులు మీరు వేశారు కానీ లోపల నాకు జరిగిన అవమానం గురించి మీరు ఆలోచించడం లేదు అని అవని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అయితే అవని శ్రీకర్ వచ్చారు కదా నీకు బెయిల్ తీసుకొని వస్తారు నువ్వేం బాధపడొద్దు అని అక్షయ్ అంటాడు. అటు కమల్ కూడా నువ్వేం బాధపడొద్దు రా మీ ఇద్దరికీ బెయిల్ వస్తుంది కదా చూద్దాము అని అక్షయ్ అంటాడు..

పల్లవి మాటతో షాక్..

పల్లవి అవనికి ఎలాగైనా దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. అవని నేను బయటికి రానివ్వకుండా చూడాలి అని పల్లకి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అక్కడున్న పోలీసు అవనికి ఫోన్ చేసి వచ్చారు ఏం చేయాలి చెప్పండి అని. అడుగుతుంది ఒకవేళ అవనికి బెయిల్ వస్తే ఇక మీదట ఏమీ చేయలేము అని పోలీస్ అనగానే ఆ అవినీతి పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అంటుంది పల్లవి ఇక పోలీసు ఎలాగైనా సరే అవి నీకు బెయిల్ రాకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి చెప్పినట్లే చేయలేని పోలీసు అనుకుంటూ ఉంటుంది..

శ్రీకర్ కు షాక్..

Advertisement

అవని కి ఎలాగైనా సరే బెయిల్ ఇవ్వాలి అని శ్రీకర్ లాయర్ దగ్గరికి వెళ్లి పేపర్స్ ని తీసుకుని వస్తాడు. అయితే కమల్ కి మాత్రమే పోలీసులు బెయిల్ ఇస్తారు కానీ అవి బెయిల్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. ఆమె మీద మీరు పెట్టిన సెక్షన్లు రెండు మాత్రమే బెయిల్ వచ్చింది. ఇప్పుడు మరో రెండు కేసులు ఆమె మీద ఉన్నాయని మీరు చూసుకోలేదు అందుకే ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదు అని ఎస్ఐ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. టైం అయిపోయింది కాబట్టి కోర్టు బెయిల్ కూడా ఇవ్వదు అని పోలీసులు అనడంతో స్వీకతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అవని మరో రెండు రోజులు పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉండాలా అని అందరూ బాధపడిపోతున్నారు. ఇక అవని మాత్రం పల్లవి తన మీద కచ్చి తీర్చుకుంటుంది అని బాధ పడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode October 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, ఐశ్వర్య పెళ్లి కోసం ఇందు ఏం చేసిందో తెలుసా..?   

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హైదరాబాద్‌కు వైజయంతి – అయోమయంలో మనోహరి

‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

Big Stories

Advertisement
×