BigTV English

Jagan news: బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. జగన్ , సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు..

Jagan news: బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. జగన్ , సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు..
CM Jagan news

CM Jagan news(Breaking news in Andhra Pradesh) :

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.


పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పై ఉన్నారని ఆ పిటిషన్ లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని ఆరోపించారు. అందుకే వెంటనే జగన్ బెయిల్‌ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు .. సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించింది.

ఈ కేసుపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు సమర్పించారు. జగన్‌కు బెయిల్‌ మంజూరైన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పుడే బెయిల్‌ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తర్వాత ప్రక్రియ చేపట్టాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.


హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విచారణను బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను కూడా జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తుదిపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో ప్రశాంతంగా పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×