E-Paper
Advertisement

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకులం ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు సాయంత్రం ప్రీమియర్లు ప్రసరం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్ల వద్ద నాని అభిమానుల హంగామా మొదలైంది. ఇక ఈ సినిమా విషయంలో చిత్ర నిర్మాతలు మొదటి నుంచి కూడా విభిన్న రీతిలో ప్రమోషన్లను నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త అనుభూతిని కల్పించడం కోసం నిర్మాతలు మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

మైత్రి థియేటర్స్ లో తెలంగాణ స్పెషల్ ఫుడ్..

ఈ సినిమా నైజం హక్కులను టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా తెలంగాణ నేటివిటీకి అనుగుణంగా ప్రేక్షకులు ప్రత్యేక అనుభూతిని పొందడం కోసం మైత్రి థియేటర్ ఓనర్స్ సరికొత్త ఆలోచన ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హైదరాబాదులోని మైత్రి విమల్, మైత్రి శివగంగా థియేటర్లలో ది ప్యారడైజ్ సినిమా చూసే ప్రేక్షకుల కోసం ఇంటర్వెల్ లో స్నాక్స్ గా తెలంగాణ ఫేమస్ సర్వపిండిని(Sarvapindi) అందించబోతున్నారు.

ప్రేక్షకులకు స్నాక్స్ గా సర్వపిండి…

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ వారు తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తెలంగాణ అంటే సర్వపిండికి ప్రత్యేకత. ఇలా సర్వ పిండిని ప్రేక్షకుల కోసం థియేటర్లలో అందించబోతున్న నేపథ్యంలో ఇది కాస్త సంచలనంగా మారింది. బామ్మ స్టోరీస్ లో 77 ఏళ్లు బామ్మ ఎంతో ప్రేమగా తయారు చేసిన ఈ సర్వపిండి ఒక చిన్న టిఫిన్ సెంటర్ నుంచి మొదలై తెలంగాణలో వెండితెర వరకు చేరటం విశేషం అని చెప్పాలి. మొదటిసారి ప్రేక్షకుల కోసం తెలంగాణ ప్రత్యేక ఫుడ్డును ఇంటర్వెల్లో భాగంగా ప్రేక్షకులకు అందించబోతున్న నేపథ్యంలో ఇది కాస్త ఆసక్తికరంగా మారింది.

Advertisement

ఇలా తెలంగాణ నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కిన సినిమాని వెండితెరపై చూస్తూ.. తెలంగాణ కథతో పాటు రుచిని కూడా ప్రేక్షకుల చేత ఆస్వాదింప చేయాలని నేపథ్యంలో నిర్మాతలు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తుంది. మరి మైత్రి నిర్మాతలు చేసిన ఈ వినూత్న ఆలోచనకు ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఐడియా కనుక వర్క్ అవుట్ అయితే ఇకపై ఇదే ఆలోచనను అన్ని సినిమాల విషయంలో కూడా అనుసరిస్తారని చెప్పాలి.ఇక ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు నాని ఎప్పుడు నటించిన విధంగా ఈ సినిమాలో సరికొత్త పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!

Related News

కయాదు లోహర్ పేరుకి పురాణాలతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!

మోద రాత్రి మూవీలో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

తల్లి కావాలంటే పెళ్లే అవసరమా? వివాహ వ్యవస్థపై శృతిహాసన్ కామెంట్స్!

కొంచెం విషమిచ్చి చంపేయండి- పవిత్ర గౌడ!

థియేటర్లో సినిమా చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

చిరు 48 ఇండస్ట్రీ జర్నీ ..పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×