Big Stories

Earth Quake In Japan: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం..

Earthquake Hits Western Japan: జపాన్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతలో భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సునామీ వచ్చే అవకాశం లేదని జపాన్ ప్రభుత్వం తెలపడంతో తీర ప్రాంత ప్రజలను ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

షికోకు ద్వీపంలోని పశ్చిమ తీరంలో భూమికి 25 కిలోమీటర్ల దిగువన 6.4 తీవ్రతతో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపంచడంతో జపాన్ ప్రజలు భయంతో ఇంట్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సునామీ వచ్చే అవకాశం లేవని జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ తీర ప్రాంత ప్రజలకు వెల్లడించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Earthquake Hits Western Japan
Earthquake Hits Western Japan

పశ్చిమ జపాన్ లోని కైకూ, షికోకు ద్వీపాలను వేరు చేసే బుంగో ఛానల్ ను భూకంప కేంద్రంగా జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ గుర్తించింది. భూకంపం కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరగవచ్చని అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం ఉండకపోవచ్చని అంచనా వేశారు.

Also Read: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

వారం రోజుల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో రెండు సార్లు భూకంపం రావడంతో జపాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతవారంలో కూడా జపాన్ లో 6.0 తీవ్రతలో భూకంపం సంభవించింది. ఈ మధ్య కాలంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News