E-Paper
Advertisement

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఆ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. ఆ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement
Viveka Murder Case updates

Viveka Murder Case updates(Today’s state news): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో గంగిరెడ్డికి వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సమయంలో ఆ న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హత్య కేసు అని స్పష్టం చేసింది. బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని తేల్చిచెప్పింది. వివేకా హత్య కేసులో చాలా సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. బెయిల్‌ కోసం వేచి చూడాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరోవైపు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌తో జతచేయొద్దని గంగిరెడ్డి తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కానీ ఆ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గంగిరెడ్డికి బెయిల్‌ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గతంలోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Advertisement

ఎర్ర గంగిరెడ్డి పిటిషన్‌ను అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌కు జత చేస్తూ సెప్టెంబర్‌ రెండో వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయడంతోపాటు వివేకా హత్య కేసు వివరాలు, డైరీ సీల్డ్‌ కవర్‌లో అందించాలని సీబీఐను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్‌ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను సీల్డ్‌ కవర్‌లో అందించాలని సుప్రీంకోర్టు కోరింది.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×