E-Paper
Advertisement

Rahul Gandhi : పరువు నష్టం కేసు.. రాహుల్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

Rahul Gandhi : పరువు నష్టం కేసు.. రాహుల్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
Advertisement

Rahul Gandhi news today(Latest breaking news in telugu): మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాహుల్ గాంధీపై ఎదుర్కొంటున్న పరువు నష్టం కేసులో జులై 21న విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని కోరుతూ రాహుల్‌ వేసిన స్టే పిటిషన్‌ను ఇటీవల గుజరాత్‌ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. కర్ణాటకలోని కోలార్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పరువునష్టం కేసు నమోదైంది. గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మార్చిలో ఈ తీర్పు వెలువరించింది.

Advertisement

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంట్ సభ్యుడికి ఏదైనా కేసులో రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో సూరత్ ‌ కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దైంది.

సూరత్ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×