Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ లాంటి 1,000 మంది రాక్షసులు వచ్చినా సరే అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు. రాజధాని విషయంలో అమరావతి ప్రాంత రైతులు, మహిళ పోరాటం ఎనలేనిదని కొనాయాడారు.
గుంటూరు జిల్లాలోని తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు జగన్ పై పలు విమర్శలు చేశారు. 2019లో జగన్ కు ఓటు వేసి ప్రజలు తిక్కలోడికి అధికారం కట్టబెట్టారని.. దాని ఫలితంగా రాష్ట్రాలని రాజధాని లేకుండా పోయిందని దుయ్యబట్టారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచినా సరే.. మూడు మూక్కలాట ఆడుతున్నారే తప్పు మరేం చేయలేదన్నారు.
రాజధాని నిర్మాణం కోసం అమరావతిలోని 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాలను అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో రాజధానికి కేంద్రం కూడా సహకరించి.. నిధులు ముంజూరు చేసిందన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ, గుంటూరు జిల్లాలతో కలిపి అమరావతిని హైదరాబాద్ లా మార్చుదామని ప్లాన్స్ చేశామన్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపే చూశాయన్నారు.
రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అని.. పెద్ద పెద్ద భవనాలు కాదన్నారు. అమరావతి రాజధానికి అక్కడి నుంచి ఎవ్వరూ మార్చలేరని పేర్కొన్నారు. ఎప్పటికైనా ఏపీ రాజధాని అమరావతేనని.. ఎవ్వరికీ సాధ్యం కానీ వాటిని కూడా.. టీడీపీ సుసాధ్యం చేస్తుందన్నారు. వైసీపీ ముడుపులు ఇవ్వలేకనే పలు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లాలో వైసీపీని ప్రజలు తరిమికొడతారన్నారు.
Also Read: మా మేనత్త అందుకే జగన్‌కు సపోర్ట్ చేస్తోంది : వైఎస్ షర్మిల
తాను సీఎంగా ఉండి ఉంటే పోలవరం నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ద్వారా వైసీపీపై కక్ష తీర్చుకునే మంచి అవకాశం వచ్చిందన్నారు. ఏపీ బాగుపడాలేంటే జగన్ సీఎం సీటు నుంచి వెంటనే దిగిపోయాలని, అది ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. కాగా, జూన్ 4న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు.