Sreeleela Social Media Video got Viral: గతేడాది మొత్తం శ్రీలీల నామ జపంతో ఊగిపోయిన సోషల్ మీడియా కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపిస్తుంది. వరుస సినిమాలు ప్లాప్ అందుకోవడంతో చిన్నదాని జోరు తగ్గింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీలీల సినిమాల గురించి పక్కన పెడితే.. ఆమె మంచి మనసుకు ఎవరైనా ఫిదా కాకుండా ఉండరు.
మొదటి నుంచి కూడా శ్రీలీల ఎక్కువ చిన్నపిల్లలతోనే కనిపిస్తూ ఉంటుంది. నెలల పిల్లలను ఎత్తుకొని ఆడించడం కూడా శ్రీలీల ఎంతో అలవోకగా చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా కూడా మారాయి. ఇక ఈ మధ్య తన పుట్టినరోజును అనాధ పిల్లల మధ్య జరుపుకొని తన మంచి మనసును బయటపెట్టింది. తాజాగా మరోసారి శ్రీలీల.. చిన్నపిల్లలతో చిన్నారిగా మారి ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో పిల్లలతో కలిసి.. ఆకేసి, పప్పేసి.. నీకో ముద్ద.. నాకో ముద్ద అంటూ అల్లరి చేస్తుంది. ఈ వీడియోలో ఆమె ఎంతో క్యూట్ గా ఉంది. ఈ వీడియోను ఆమె షేర్ చేస్తూ.. ఈ క్యూటీస్ ను మిస్ అవుతున్నా.. అంటూ రాసుకొచ్చింది. ఇక చిన్నారులతో కలిసి చిన్నారిగా మారి ఆడుతున్న శ్రీలీలను చూసి అభిమానులు.. వావ్ అంటున్నారు. ఇకపోతే ఈ చిన్నది తన తదుపరి సినిమాలతో హిట్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read: Sreeleela: ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలా..!
Aakesi pappesi… Neekoka muddha Naakoka muddha 🥹📷 #Sreeleela@sreeleela14 pic.twitter.com/sqa8H6z6nG
— SAI KRISHNA (@SAIKRIS40918887) April 13, 2024