Big Stories

YSRCP Compare BRS: గంటా సంకేతాలు.. ఎన్నికల తర్వాత అదే పరిస్థితి..?

YSRCP Compare BRS: వైసీపీ అధినేత జగన్ బస్సుయాత్ర ఉమ్మడి విశాఖకు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం జగన్‌‌పై విమర్శలు మొదలుపెట్టేశారు టీడీపీ సీనియర్లు. ఈ జాబితాలోని ముందు వరుసలో ఉంటారు మాజీ మంత్రి, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు.

- Advertisement -

ఎన్నికల వేళ వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. ముఖ్యంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున వైసీపీ నేతలు, కేడర్ టీడీపీలోకి చేరుతోందన్నారు. ఈలెక్కన ఫ్యాన్ పార్టీ రోజురోజుకూ దిగజారుతోందని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం జగన్ వ్యవహారశైలి నచ్చక చాలామంది నేతలు సైతం టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు.

- Advertisement -

విశాఖలోని మధురవాడలో పార్టీ ఆఫీసును గంటా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అస్సలు ఊహించు కోలేమన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉండలేక అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ వైపు వెళ్లిపోతున్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వైసీపీకీ అదే పరిస్థితి ఖాయమన్నారు.

Also Read: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు..

ఉన్నట్లుండి గంటా వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. సీఎం జగన్ బస్సుయాత్ర విశాఖకు వస్తోందని, కావాలని తమ అధినేతను టార్గెట్ చేశారని గుర్తు చేస్తున్నారు. అయినా గంటాను ఆపార్టీలో పట్టించుకునే కరువయ్యారని అంటున్నారు. గంటాకు సీఎం జగన్ సరైన కౌంటర్ ఇస్తారని అంటున్నారు. అటు టీడీపీ నేతలు మాత్రం గంటా వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు.

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నవాళ్లూ లేకపోలేదు. ప్రభుత్వం భూములు అమ్మేయడం, భూముల విలువ పెంచడం తప్ప అధికార పార్టీ ఏం చేసిందనేది టీడీపీ నేతల వాదన. పనిలోపనిగా మాజీమంత్రి భీమిలి వైసీపీ అభ్యర్థి, తన శిష్యుడు అవంతిపైనా విమర్శలు ఎక్కుపెట్టారు గంటా శ్రీనివాసరావు. ఫోన్లు చేసి బెదిరిస్తే.. పార్టీలోకి ఎవరు చేరుతారని ప్రశ్నించారు. గంటా వ్యాఖ్యాలతో విశాఖలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News