BigTV English

Heat Waves Alert: జర భద్రం.. ఈ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు.. ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు!

Heat Waves Alert: జర భద్రం.. ఈ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు.. ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు!

Heat Waves Alert by IMD to Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు కాదు కదా.. 8 గంటలు దాటితేనే సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మండుటెండలు, విపరీతమైన ఉక్కపోత, వడగాలులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రివేళ ఉష్ణోగ్రతలు సైతం గరిష్ఠంగా నమోదవుతున్నాయి. ఇళ్లలో ఉన్న ఫ్యాన్ల గాలి సరిపోక.. కాస్త కునుకైనా పట్టట్లేదు ప్రజలకు. చెమటతో శరీరమంతా తడిచిపోయి తీవ్ర చికాకుకు గురిచేస్తోంది ఉక్కపోత.


చిన్నారులు, వృద్ధులైతే బయటకు రాకపోవడమే మంచిదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఈ క్రమంలో తాజాగా భారత వాతావరణ శాఖ (IMD) వివిధ రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తూ.. ఒక లిస్ట్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 23వ తేదీ వరకూ ఆయా రాష్ట్రాల్లో వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు సైతం పెరగనున్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 20,21 తేదీల్లో ఒడిశా, 20 నుంచి 23 తేదీల మధ్య జార్ఖండ్, గంగానది పశ్చిమబెంగాల్, బీహార్ లకు హీట్ వేవ్ అలర్ట్ జారీ అయింది. ఈ రాష్ట్రాల్లో ఆయా తేదీల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.


Also Read: సన్ టాన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే

ఏపీ, తెలంగాణ, యానాం, మాహే, కేరళ, సిక్కిం, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 20-23 మధ్య వేడిగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వాలు కూడా ప్రజలకు వడగాల్పులపై అవగాహన కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తెలిపింది.

ఏపీలో నేడు 55 మండలాల్లో తీవ్ర వడగాలులు, 197 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 23, మన్యంలో 15, అనకాపల్లిలో 6 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 19) అత్యధికంగా మన్యం జిల్లా సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×