TDP Serious: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ చేసిన వారిని విడిచిపెట్టలేదు కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు. నేతలు, వారి వ్యక్తిగత వ్యవహారాలపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అలాంటి పని చేసిన ఐటీడీపీ కార్యకర్తపై వేటు వేసింది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది కూడా టీడీపీ కమాండ్.
గడిచిన కొన్నాళ్లుగా నేతలు, సెలబెట్రీలు వ్యక్తిగత జీవితాలు, ఫ్యామిలీలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు పార్టీల మద్దతుదారులు. వైసీపీ హయాంలో ఈ సంస్కృతి మరింత ఎక్కువైంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే వాటిపై దృష్టిపెట్టింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీలోకి కొందరు నేతలు, కార్యకర్తలు అరెస్టు అయ్యారు. మరి కొందర్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా మాజీ సీఎం జగన్ వైఫ్ భారతి(Bharathi)పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Kiran). అతడి వ్యాఖ్యల వ్యవహారం టీడీపీ హైకమాండ్ దృష్టిలో పడింది. దీనిపై సీరియస్ అయ్యింది. వెంటనే అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కిరణ్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే కిరణ్‌పై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. అతడ్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై కిరణ్ రియాక్ట్ అయ్యాడు. మాట్లాడిన వీడియోను విడుదల చేశాడు. వైఎస్ భారతిపై తాను చాలా తప్పుగా మాట్లాడానని తెలిపాడు. జగన్ దంపతులు తనను క్షమించాలని వేడుకున్నాడు. మహిళల గురించి ఇలా మాట్లాడడం ముమ్మాటికీ తప్పు అని చెప్పాడు. క్షణికావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశానని వేడుకున్నాడు.
ALSO READ: కవిత వర్సెస్ జనసేన అద్దాల భవనంలో ఉండేవాళ్లు రాళ్లు విసిరితే అంతే
మరోవైపు కిరణ్ ఎపిసోడ్‌పై వైసీపీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఎక్స్ వేదికగా ఆ పార్టీ స్పందించింది. ఇది ముమ్మాటికీ సిగ్గుచేటుగా తెలిపింది. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మాజీ సీఎం జగన్ కుటుంబంపై ఐటీడీపీ కార్యకర్త ఈ విధంగా మాట్లాడడం మంచిదికాదని పేర్కొంది. వెంటనే అతడ్ని అరెస్టు చేయాలన్నది వైసీపీ డిమాండ్.
ఈ తరహా పనులు ఎవరు చేసినా ఇబ్బందులు ఎదుర్కొంటారని కిరణ్ వ్యవహారం ద్వారా చెప్పకనే చెప్పింది కూటమి ప్రభుత్వం. మరికొందరికి ఇదొక గట్టి హెచ్చరిక. తప్పు చేస్తే సొంతవారిని ఉపేక్షించేది లేదని బలమైన సంకేతాలు ఇచ్చింది టీడీపీ. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. మొత్తానికి చాన్నాళ్లు తర్వాత ఏపీలో మంచి సంప్రదాయం మొదలయ్యిందనే చెప్పవచ్చు.
YS భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం
మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదన్న టీడీపీ అధిష్టానం
కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్టానం
చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని… pic.twitter.com/MOprM4D4j1
— BIG TV Breaking News (@bigtvtelugu) April 10, 2025
Unacceptable and shameful! An ITDP member has used abusive language against the family of former CM YS Jagan Mohan Reddy garu. This goes beyond political hatred — it’s pure obloquy. We demand immediate arrest.@APPOLICE100, @ncbn, @Anitha_TDP, @PawanKalyan, @naralokesh… pic.twitter.com/3D39X3KGu3
— YSR Congress Party (@YSRCParty) April 9, 2025