BigTV English

SRH Telugu Festivals: SRH కొంప ముంచుతున్న తెలుగు పండుగలు

SRH Telugu Festivals: SRH కొంప ముంచుతున్న తెలుగు పండుగలు

SRH Telugu Festivals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విధ్వంసకర క్రికెట్ కి పెట్టింది పేరు సన్రైజర్స్ హైదరాబాద్. అలాంటి ఎస్.ఆర్.హెచ్ ఈ సీజన్ లో తేలిపోతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది. కేవలం మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానమైన పదవ స్థానంలో నిలిచింది.


SRH వరుస ఓటములు

ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయం సాధించి లీగ్ టాపర్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తరువాత వరుస ఓటములతో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్ లోనే దాదాపు 300 పరుగులు కొట్టేసినంత పనిచేసింది సన్రైజర్స్ హైదరాబాద్. 250 పరుగులు దాటితేనే గొప్ప అనుకునే ఐపిఎల్ లో.. గత సీజన్ లో చూపించిన దూకుడు మామూలు స్థాయి కాదు. 2024లో సన్రైజర్స్ 287 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేసింది.


ఒకప్పటి టాప్ స్కోరర్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై పై 277, ఢిల్లీ పై 266 పరుగులు చేసింది. ఈ రికార్డులను దాటి సన్రైజర్స్ 287 పరుగుల అత్యధిక స్కోర్ ని నమోదు చేసింది. ఇక ఈ సీజన్ ప్రారంభంలో మార్చ్ 23వ తేదీ ఆదివారం రోజున ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా చేజింగ్ లో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం వరుసగా 4 మ్యాచ్ లు ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టుకు పండగ రోజులు పెద్దగా కలిసి రావట్లేదు. ఇప్పటివరకు ఓడిన 4 మ్యాచ్లలో రెండు మ్యాచ్లు పండగ రోజులలోనే జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత నెల 31 తేదీ ఉగాది రోజున ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడింది సన్రైజర్స్.

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. మరోవైపు అన్ని విభాగాలలో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈనెల 6వ తేదీన శ్రీరామనవమి రోజున గుజరాత్ టైటాన్స్ తో తలపడింది హైదరాబాద్. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది గుజరాత్.

SRH కొంప ముంచుతున్న తెలుగు పండుగలు

ఇక ఇక్కడే సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరో టెన్షన్ మొదలైంది. ఈనెల 12వ రోజున హనుమాన్ జయంతి రోజు పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది సన్రైజర్స్. మరో పండగ రోజైన హనుమాన్ జయంతి రోజు పంజాబ్ పై సన్రైజర్స్ ఓడిపోతుందా..? లేక ఆ హనుమంతుడి ఆశీస్సులతో ఆరెంజ్ ఆర్మీ గెలిచి.. తిరిగి గెలుపు బాట పడుతుందా..? అనే టెన్షన్ హైదరాబాద్ అభిమానులలో మొదలైంది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×