BigTV English

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?
TDP Janasena News

TDP Janasena News(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటన్నరపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.


టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ చర్చించారని తెలుస్తోంది. 40 నుంచి 42 వరకు సీట్లు పవన్ కల్యాణ్ అడిగారని సమాచారం. 25 నుంచి 30 సీట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధినేత ఉన్నారంటున్నారు. 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది. 2 లోక్ సభ సీట్లు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉందంటున్నారు. డిసెంబర్ చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారని టాక్.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసే అంశంపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారని తెలుస్తోంది. తటస్థలు , వైసీపీ నేతలు జనసేనలో చేరికపై చర్చించారట. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.


ఏపీలో త్వరలో 3 చోట్ల ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహించాలని బాబు-పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపైనా చర్చించారని సమాచారం.

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×