E-Paper
Advertisement

Budda Tweet on Vijaysai Reddy: ముసలోడే కానీ మహానుభావుడు: ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న సెటైర్లు..!

Budda Tweet on Vijaysai Reddy: ముసలోడే కానీ మహానుభావుడు: ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న సెటైర్లు..!
Advertisement

Budda Venkanna Slams YCP Leader Vijaysai Reddy on Twitter: వైసీపీ ఎంపీ, సీనియర్ లీడర్ వి విజయసాయి రెడ్డిపై రెండు మూడు రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన ఓ మహిళా అధికారికి ఆయనకు అక్రమ సంబంధాన్ని కట్టబెడుతూ వార్తలూ వచ్చాయి. ఈ అంశంపై రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కూడా ఈ అంశంపై స్పందించడం సంచలనంగా మారింది.

సైరా సాయి రెడ్డి అంటూ రూమ్ కి రా అనే అర్థం వచ్చేలా బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ముసలోడే కాని మహానుభావుడు అంటూ పేర్కొన్నారు. అధికారం అంటే అధికారులను వాడుకోవడమేగా.. వీసా తాత? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులపై బుద్ధా వెంకన్న విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అభివృద్ధి పరిస్తే.. జగన్ మాత్రం అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపించారని, వైసీపీ చేసిన పిచ్చి పనులకు ప్రజలు తరిమికొట్టారని చెప్పారు.

Advertisement

Also Read: Shanthi’s husband Madhan Press meet: శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి: భర్త మదన్

Advertisement

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఓ అధికారిణిని గర్భవతి చేశాడని సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీ వర్గాలు తీవ్రమైన పోస్టులు పెడుతున్నాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ అధికారిణి భర్త వైసీపీ నేతపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, తన భార్య ప్రెగ్నెంట్‌కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సారి విజయసాయి రెడ్డి కారణం అని, మరోసారి ప్రభుత్వ ప్లీడర్ కారణం అని, ఇంకోసారి వేరొకరు కారణం అని తన భార్య రకరకాలుగా చెబుతున్నదని తెలిపారు. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరుగుతాయని తాను ఊహించలేదని, దయచేసి ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ కూడా వైరల్ కావడంతో విజయసాయి రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి.

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×