BigTV English

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?

Galla Jayadev : టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. పదవిలో ఉంటే తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే వెల్లడించారు.ఈ భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై మౌనంగా ఉండలేనని అన్నారు. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.


గత పదేళ్లుగా గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారు. వరుసుగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014 , 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. నేరుగా మిస్టర్ పీఎం అంటూ నేరుగా ప్రధాని మోదీని ఏపీ హక్కలపై ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్ ఇలాంటి కీలక అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో ఆయన స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ప్రశంసలు వచ్చాయి.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×