Pulivendula ZP: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పులివెందుల-ఒంటిమిట్ట జెడ్పీలను టీడీపీ గెలుస్తోందా? నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారా? ఈ గెలుపు వెనుక స్కెచ్ ఎవరిది? ముగ్గురు నేతలు ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఆ నేతలు ఎలా ప్లాన్ చేశారంటూ వైసీపీ శ్రేణులు, నేతలు ఆశ్చర్యపోతున్నారు.
మంగళవారం ఏపీలో జెడ్పీ, ఎంపీపీ, పంచాయితీలకు ఉప ఎన్నికలు జరిగాయి. మిగతా ప్రాంతాల విషయం కాసేపు పక్కనబెడితే.. అందరి దృష్టి పులివెందులపై పడింది. ఎందుకంటే జగన్ ఫ్యామిలీకి పులివెందుల కంచుకోట. గడిచిన మూడు దశాబ్దాలుగా అక్కడ జెడ్పీ ఎన్నికలు జరిగిన సందర్భం లేదు. ఏకగ్రీవంగా నచ్చినవారిని ఎంపిక చేయడమే అందుకు కారణం.
ఉప ఎన్నికల్లో అలాగే చేయాలని ప్లాన్ చేశారు వైసీపీ నేతలు. ఈసారి పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి భార్య బరిలో ఉండడంతో వైసీపీ షాకైంది. ఎలాగైనా వార్ వన్ సైడ్ చేయాలని భావించింది. అందుకు వైసీపీ వేసిన ఎత్తులు పని చేయలేదు. ఇరుపార్టీలో వందల కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
పులివెందుల కోటపై ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడబోతోందని నేతలు ధీమాగా చెబుతున్నారు. దీనికి కారణం ఎవరు? అన్నదానిపై ఏపీ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒకరు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి,మంత్రి లోకేష్ వెనుక నుండి నడిపించారని అంటున్నారు.
ALSO READ: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది?
పోలింగ్ రోజు ఇరుపార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేయడం, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఓటు వేసే పరిస్థితి నెలకొంది. ఒకవిధంగా చెప్పాలంటే పులివెందుల ఎన్నికలో ఈసీ విజయం సాధించిందనే చెప్పాలి.
మూడు దశాబ్దాలుగా అక్కడ ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం చేసుకుంది జగన్ ఫ్యామిలీ. దీని వెనుక జగన్ నిర్ణయాలే అందుకు కారణమని తెలుస్తోంది. వివేకానంద హత్య, జగన్‌కు అండగా ఉండే తల్లి, చెళ్లెల్లు దూరం కావడం, పులివెందుల అభివృద్ది కోసం చిన్నచిన్న నాయకులు చాలానే ఖర్చు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత వారికి నిధులు రాలేదు. ఈ క్రమంలో ఆ తరహా నేతలు టీడీపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో వైసీపీ కోటకు బీటలు ఏర్పడిందని అంటున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదని అంటున్నారు. వైఎస్ ఫ్యామిలీలో అంతా కలిసి ఉండేవారని చెబుతున్నారు.
2021లో జరిగిన కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో 52 స్థానాలకు 49 సీట్లను ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. అందులో మూడు సీట్లకు ఎన్నికలు జరిగితే వాటిని వైసీపీ సొంతం చేసుకుంది. వందకు 100 శాతం వైసీపీ గెలిచింది. ప్రజాస్వామ్యంలో అది సాధ్యమా? అన్నది తొలి ప్రశ్న. తొలిసారి పులివెందులలో ఎన్నిక జరిగింది. కేడర్ చెదిరిపోకుండా బీటెక్ రవి ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు.
హైకమాండ్ నుంచి అండదండలు ఉండడం, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహకారం కలిసి వచ్చిందని అంటున్నారు. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీ పతనానికి కారణమని అంటున్నారు స్థానికులు. పులివెందులతోపాటు ఒంటిమిట్ట కూడా టీడీపీకే ఎడ్జ్ ఉందని అంటున్నారు. ఈ ఉప ఎన్నిక నుంచి జగన్ పాఠాలు నేర్చుకుంటారా? అన్నది చూడాలి.