Pulivendula: మూడు దశాబ్దాలపాటు పదిలంగా ఉన్న పులివెందుల జగన్ కోట బద్దలైంది. తొలిసారి ఆ కోటలో టీడీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని చివరివరకు తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ. దాదాపు 30 ఏళ్లుగా పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చింది. చివరకు ఈసారి ఎన్నికల్లో చిత్తయ్యింది.
తొలిసారి పోలీసులు తమ అధికారాలను ఉపయోగించి అధికార-విపక్షాల నేతలను అరెస్టు చేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి పత్తా లేకుండా పోయారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నుంచి అధికార టీడీపీ-వైసీపీ మధ్య రాజకీయాలు ఆసక్తికరంగా సాగాయి. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు అడుగులు వేశారు ఇరుపార్టీల నేతలు. నోటిఫికేషన్ విడుదలైన నాటికి సీఎం చంద్రబాబు టీమ్ సింగపూర్‌లో పర్యటిస్తోంది.
అనుహ్యంగా ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగిన అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని జిల్లా నాయకులతో మంతనాలు జరిపారు. చివరకు పులివెందుల నుంచి టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి అయితే బాగుంటుందని ఓ అంచనాకు వచ్చారు. వెంటనే పార్టీ హైకమాండ్ ఓకే చేయడం, నామినేషన్ వేయడం చకచకా జరిగిపోయింది.
ALSO READ: కాంగ్రెస్ నుంచి జగన్ కు సంకేతాలు, షర్మిలతో చేతులు కలుపుతారా?
ఈలోగా వైసీపీలోని అసంతృప్తులను తనవైపు తిప్పుకున్నారు బీటెక్ రవి. అటు జమ్మలమగుడు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి- బీటెక్ రవి జెడ్పీటీసీ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. స్థానికుల నుంచి మాంచి స్పందన వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన గమనించిన టీడీపీ నేతలు గెలుపు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజు పోలీసులు పూర్తిస్థాయిలో తమ అధికారాలను ఉపయోగించారు. అధికార-విపక్షాల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. చివరకు రాయలసీమ డీఐజీ అక్కడి వచ్చారంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మంగళవారం జరిగిన ఎన్నిక పోలింగ్ జరగ్గా, గురువారం ఉదయం ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో లతారెడ్డి 6,033 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గట్టి పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి పత్తా లేకుండా పోయారు. చివరకు డిపాజిట్ కోల్పోయారు.
వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవం చేసుకున్న వైసీపీకి కేవలం మూడంకెల ఓట్లు వచ్చాయి. ఆ పార్టీపై అక్కడి ప్రజల్లో తమకున్న ఆగ్రహాన్ని ఓటు ద్వారా తెలియజేశారు. స్వతంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు వచ్చాయి.
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు మంత్రి సవిత. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కోటను నిర్వీర్యం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సదరు మంత్రి. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీపీని టీడీపీ గెలుచుకుంది. అక్కడ టీడీపీకి 12,519 ఓట్లు రాగా, వైసీపీకి 6298 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 268 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి 6221 ఓట్లు తేడాతో విజయం సాధించారు.
BREAKING
పులివెందులలో టీడీపీ విజయం
6 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డి
లతారెడ్డికి పోలైన ఓట్లు 6,833
వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి పోలైన ఓట్లు 682#zptcbyelection pic.twitter.com/h4Nd0itJY4
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025