Bipasha Basu:ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు (Bipasha Basu) మోడల్ గా కెరియర్ను మొదలుపెట్టి, ఆ తర్వాత నటిగా మారింది. ప్రధానంగా హిందీ సినిమాలలో చేసే ఈమె.. తెలుగు, తమిళ్, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈమె.. అనేక పురస్కారాలు కూడా అందుకుంది. ఇక తన పని తాను చేసుకుంటూ సినిమాలతో బిజీగా మారిన ఈమె.. తాజాగా ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunhal Thakur) పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు.
మృణాల్ ఠాగూర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన బిపాషా బసు..
అసలు విషయంలోకి వెళ్తే.. ‘సీతారామం’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన మృణాల్ ఠాగూర్ ఈ మధ్య వరుస చిత్రాలలో నటించకపోయినా.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు ధనుష్ (Dhanush) తో డేటింగ్ రూమర్స్ కారణంగా హాట్ టాపిక్ గా మారిన ఈమె.. ఇప్పుడు బిపాషా బసు కామెంట్స్ తో మరొకసారి వార్తల్లో నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే బిపాషా తాజాగా మహిళలను ఉద్దేశిస్తూ ఒక కొటేషన్ పంచుకున్నారు.” బలమైన మహిళలు ఎప్పుడూ కూడా ఒకరి ఉన్నతి కోసం మరొకరు కృషి చేస్తారు. నిజానికి మహిళలంతా చాలా దృఢంగా, బలంగా ఉండాలి. అప్పుడే వారు మానసికంగా అటు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుండి బయటకు రండి ” అంటూ తెలిపింది. అంతేకాదు దీనికి ” మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి” అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో మృణాల్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
అసలు విషయంలోకి వెళ్తే.. ఒక వీడియోలో మృణాల్ మాట్లాడుతూ.. ” తాను బిపాషా కంటే చాలా అందంగా ఉంటానని, ఆమె కండలు తిరిగిన దేహంతో పురుషుడిలా కనిపిస్తారని.. ఆమెతో పోల్చుకుంటే తాను చాలా అందంగా ఉంటానని” కూడా కామెంట్ చేసింది మృణాల్ ఠాకూర్. ఈ కామెంట్లు చేయడంతో ఈమెపై పలువురు సెలబ్రిటీలు మండిపడ్డారు. ఈమె మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈమెకు గట్టి కౌంటర్ ఇస్తూ బిపాషా ఇలా పోస్ట్ పెట్టింది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే బిపాషా కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది మృణాల్ ఠాగూర్.
మృణాల్ ఠాగూర్ సినిమాలు..
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత విజయ్ దేవరకొండ తో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది. కానీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక ఇప్పుడు అడివి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.