BigTV English
Advertisement

Viral Video : ఈ ఆరుగురు పిల్లల తల్లికి చంద్రబాబు సన్మానం చేయడం పక్కా!

Viral Video : ఈ ఆరుగురు పిల్లల తల్లికి చంద్రబాబు సన్మానం చేయడం పక్కా!

Viral Video : ఏపీలో తల్లికి వందనం వండర్స్ చేస్తోంది. గత ప్రభుత్వంలో మాదిరి ఇంటికి ఒక్కరికే పరిమితం చేయలేదు. ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తోంది. ఒక్కొక్కరికీ రూ.13వేలు. అలా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రూ.13 వేలు ఇస్తోంది. ఇద్దరు బిడ్డలుంటే రూ.25వేలు.. ముగ్గురుంటే రూ.39 వేలు.. ఆ తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడమే. ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఎవరికి ఉంటారులే అని అనుకోవద్దు. లేటెస్ట్‌గా ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా ఓ తల్లికి ఏకంగా రూ.78 వేలు జమ అయ్యాయి. ఎందుకంటే ఆమెకు ఆరుగురు పిల్లలు మరి. అందరూ స్కూల్‌కు వెళ్తున్నారు.


ఆరుగురు పిల్లలు.. రూ.78వేలు..

వామ్మో ఆరుగురే.. నిజమా అనే డౌట్ వద్దు. అచ్చంగా ఆరుగురు పిల్లలు ఆమెకు. కొడుకు కోసం ఆగారు ఆ దంపతులు. వరుసగా ఐదుగురు అమ్మాయిల తర్వాత కొడుకు పుట్టాడు. అప్పుడిక పుల్‌స్టాప్ పెట్టారు. లేదంటే.. ఇంకెంత మందిని కనేవారో. అసలే పేద కుటుంబం.. ఆరుగురిని అయితే కన్నారు కానీ.. పెంచడం అంత ఈజీనా? పిల్లలకు తిండి పెట్టడమే భారంగా మారుతోంది. ఇక, అంతమందిని చదివించడం స్థోమతకు మించి పోతోంది. గత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం ఉన్నా.. ఇంటికి ఒక్కరికే ఇచ్చే వారు. మరి, మిగిలిన ఐదుగురు పిల్లలను చదివించడానికి చాలా కష్టపడ్డారు. ఈసారి చంద్రన్న సర్కారు ఇంట్లో బిడ్డలందరికీ తల్లికి వందనం ఇస్తామని అభయం ఇచ్చింది. అన్నట్టుగానే పథకం అమలు ప్రారంభమైంది. టకీ టకీ మంటూ బ్యాంక్ అకౌంట్లో నగదు పడిపోతోంది. అలా ఆ తల్లికి ఆరుగురు పిల్లలు ఉండటంతో.. తలా రూ.13వేలు చొప్పున.. ఏకంగా రూ.78 వేలు ఆమె ఖాతాలో జమ చేసింది కూటమి సర్కారు. ఆ అమౌంట్ చూసుకుని ఆ తల్లి తెగ ఖుషీ అవుతోంది. ఆ సంతోషాన్ని గ్రామస్తులందరితో కలిసి పంచుకుంటోంది. చంద్రబాబు, నారా లోకేశ్‌లకు ధన్యవాదాలు చెబుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి..

ఇందులో రెండు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఒకటి ఏకంగా ఆరుగురు పిల్లలను కనడం.. వారందరికీ తల్లికి వందనం సొమ్ము రూ.78వేలు రావడం. రెండూ సంచలనమే. జనాభా తగ్గిపోతోంది.. ఏపీ వాసులు ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు చంద్రబాబు. ఒకరు, ఇద్దరితో ఆపకండి.. కుదిరితే ముగ్గురిని కనండి.. వీలైతే అంతకుమించైనా ఓకే అంటున్నారు. ఎలా పెంచాలనే భయం వద్దు.. ప్రభుత్వం తరఫున సాయం చేస్తామంటూ అభయం కూడా ఇస్తున్నారు. ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటిస్తామని చెబుతున్నారు. అందుకే తల్లికి వందనం ఆర్థికంగా భారమైనప్పటికీ.. ఇంట్లో పిల్లలందరికీ వర్తింప జేసింది ప్రభుత్వం. గత వైసీపీ సర్కారుతోు పోలిస్తే.. ఇప్పుడు అదనంగా 40,040 మంది పిల్లలకు నగదు అందుతోంది. ఆ అదనపు ప్రయోజనానికి ఏకంగా రూ.54 కోట్లు ఖర్చు అవుతోంది. అయినా, ఇదిగో ఇలా ఆరుగురు పిల్లలున్నా.. ఎంతమంది ఉన్నా.. తల్లికి వందనం పక్కాగా ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. మరిక చంద్రన్న ఉండంగ.. పిల్లలను కనడానికి, వారిని చదివించడానికి ఇంకేం భయం? ఏపీ జనాభా పెంచేయండి.. చక్కగా చదివించేయండి..

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×