BigTV English

Horoscope Today: ఆ రాశి వారికి ఈ రోజంతా శుభ గడియలే.. కానీ ఆచితూచి వ్యవహరించాలి మరి!

Horoscope Today: ఆ రాశి వారికి ఈ రోజంతా శుభ గడియలే.. కానీ ఆచితూచి వ్యవహరించాలి మరి!
HoroScope Today
HoroScope Today

Horoscope Today: ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారికి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకే ఒక రాశి వారికి మాత్రం ఈ రోజు ఏ పని తలపెట్టినా అన్నీ శుభాలే జరుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది. మరి ఆ రాశి ఏదో తెలుసుకుందాం.


మేషం రాశి:

నేడు మేషరాశి వారికి అంతా సామాన్యంగానే ఉందట. వీరిని కొన్ని దుష్టశక్తులు వెంబడించే అవకాశం ఉంది. ఈ రాశి వారు కూడా తంత్రాలు, క్షుద్రపూజలు నేర్చుకోవాలనే వాటిపై ఆసక్తి చూపిస్తారట. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా వీరు సేకరిస్తారని జ్యోతిష్యం చెబుతోంది. ఈ తరుణంలో వీరు దైవ శక్తిని నమ్మాలి. ఆంజనేయ స్వామిని తలుస్తూ ధ్యానం చేయాలి.


వృషభ రాశి:

ఇవాళ వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ రాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తారు. ఆవేశానికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. పరిస్థితులు అవే సర్దుకుపోతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది.

మిథున రాశి:

నేడు మిథున రాశి వారికి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ రాశి వారు తమ ప్రతిభతో ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన బాధ్యతలను కూడా చేపడతారు. పనులు వాయిదా వేస్తే మంచిది.

Also Read: Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులు.. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగం..

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి నేడు అంతా అనుకూలంగానే ఉంది. ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడుపుతారు. అకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. లక్ష్మీదేవిని ధ్యానం చేయాలి.

సింహ రాశి:

ఈ రాశి వారికి నేడు అనుకూలంగా లేదు. కుటుంబం కలహాలతో మానసిక ఆందోళనకు గురవుతారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. శివుడిని ఆరాధించడం మంచిది.

కన్యా రాశి:

ఈ రాశి వారు నేడు ఉల్లాసంగా గడుపుతారు. సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. మీ మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

Also Read: Solar Eclipse 2024: ఆ రోజున తొలి సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త..!

తులా రాశి:

ఈ రాశి వారికి నేడు అంత అనుకూలంగా లేదు. వీరికి ఆరోగ్యం సహకరించకపోవచ్చు. పనులు వాయిదా వేస్తే మంచిది. మొండి వైఖరితో ఆలోచిస్తే సమస్యలకు దారి తీస్తుంది. లక్ష్మీ నరసింహ స్వామి దర్శిచడం కొంత వరకు మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

ఇవాళ వీరికి సాధారణంగానే ఉంది. ఈ రాశి వారు నేడు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేయడం మంచిది. లక్ష్మీ దేవి ధ్యానం శుభ ప్రదం.

ధనుస్సు రాశి:

నేడు ఈ రాశి వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. గురువును పూజిస్తే మేలు జరుగుతుంది.

Also Read: ఇవాల్టి రాశిఫలాలు.. ఈ 4 రాశుల వారికి నేడు అంతా శుభమే.. !

మకర రాశి:

ఈ రాశి వారు నేడు వారి సమర్థతతో అందరినీ మెప్పిస్తారు. సమస్యలను సకాలంలో నేర్పుగా పరిష్కరించే అవకాశం ఉంది. అనుకోకుండా ధనలాభం పొందుతారు. శివారాధన చేస్తే మేలు.

కుంభ రాశి:

నేడు ఈ రాశి వారికి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. దుర్గాదేవిని ధ్యానం చేయడం వీరికి మంచిది.

మీన రాశి:

ఈ రాశి వారు నేడు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం అంతలా సహకరించకపోవచ్చు. నేడు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం చేస్తే మంచిది.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×