Election Commission: విశాఖలో జరిగిన ఓట్ల అక్రమాలపై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొన్ని ఓట్లు తొలగించాలని దాదాపు 163 మంది ఒకటికి మించి ఫారం-7లు దాఖలు చేశారు.
దాదాపు 5వేల ఓట్లు రద్దు చేయాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారు. ప్రతి పక్ష పార్టీల ఓట్లు తొలగించాలని ఈఆర్వోపై ఒత్తిడి తెచ్చారు. వైసీపీ నాయకులే ఓట్లు తొలగించినట్లు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలనలో వెల్లడైంది.
వైసీపీకి చెందిన 10 మంది బీఎల్ఏలు నిబంధనలు ఉల్లంఘించి ఫారం-7లు సమర్పించినట్టు రిటర్నింగ్ అధికారి తేల్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు పోలీస్ స్టేషన్లలో 10 మంది వైసీపీ బీఎల్ఏలపై కేసు నమోదైంది. వీరిలో కొందరు వైసీపీ పశ్చిమ ఇంచార్జి అడారి ఆనంద్ కార్యాయలంలో పని చేసే సిబ్బందిని గుర్తించారు.