
Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సమయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ వైదొలిగిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకున్నారు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ దసరా వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను ఏ బెంచ్ విచారించాలన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఆ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ ముందుకు పంపింది. ఇప్పుడు వేకేషన్ బెంచ్ లో న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకోవడం ట్విస్ట్ చోటుచేసుకుంది.