ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదో క్లారిటీ వచ్చేసింది. అస్సాంలో ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. బెంగాల్లో పదిహేనేండ్ల మమత పాలనకు బీజేపీ చెక్ పెట్టింది. జంగిల్ రాజ్ పాలన మగిసిందని కమలం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.టీఎంసీని ఓటమిని బెంగాల్ ప్రజలు సైతం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయబోతున్నది. రెండు సార్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమ్యూనిస్టు పార్టీ పరాజయం దిశగా వెళ్తున్నది.పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటు కానుంది.ఇక తమిళనాడు విషయానికొస్తే టీవీకే చీఫ్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్లకుండా.. ప్రస్తుతం నేరుగా సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ అధికార డీఎంకే పార్టీని ఓడించి మెజార్టీ మార్క్‌ను చేరుకునే దిశగా దూసుకువెళ్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఆ పార్టీకి మెజార్టీ మార్కును ఇప్పటికే దాటేసింది. వరుసగా పదిహేను సంవత్సరాలు బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఉన్నది. సీఎంగా మమతా బెనర్జీ కొనసాగారు. ఆ పార్టీకి అక్కడ సరైన ప్రతిపక్షం కూడా లేకపోవడంతో బెంగాల్లో టీఎంసీ పాలకులు, రౌడీలు రాజ్యమేలారని ఎన్నికల సమయంలో బీజేపీ ఆరోపించింది. గతంలో టీఎంసీలోనే ఉంటూ.. మమతకు సన్నిహితుడిగా పేరున్న సువేంధు అధికారిని తమ పార్టీలోకి రప్పించుకోవడంలో కమలం పార్టీ సక్సెస్ అయ్యింది. నాటి నుంచి మమతకు గడ్డుకాలం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను సువేంధు అధికారి ఓడించారు. ఇప్పుడు బెంగాల్ బీజేపీ చీఫ్‌గా ఉన్న ఆయన ఏకంగా టీఎంసీని అధికారానికి దూరం చేశారు. టీఎంసీ పాలన పట్ల గల వ్యతిరేకతను ఐక్యం చేయడంలో బీజేపీ పెద్దలు, రాష్ట్ర చీఫ్ సక్సెస్ అయ్యారని తెలుస్తున్నది.
తమిళనాడులో ద్రవిడ సిద్ధంగా బలంగా ఉన్నది. అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ అదే సిద్ధాంతంతో ముందుకు వెళ్తుంటాయి.డీఎంకే, అన్నాడీఎంకే, సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సైతం ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళితే అక్కడి ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం కామన్. అందుకే విజయ్ పార్టీని స్థాపించిన నాడే కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా, ఉత్తరాది డామినేషన్ అంగీకరించలేదని స్పష్టంచేశారు. ద్రవిడ సిద్ధాంతానికే పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. దీనికి తోడు ఉచితంగా బంగారం ఇస్తానని ప్రకటించారు. డీఎంకే పార్టీమీదున్న వ్యతిరేకత సూపర్ స్టార్ విజయ్.. ఉచితాలకు తోడు సినీ గ్లామర్ కలిసి రావడంతో ఆయన పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ అవతరించింది. విజయ్ సీఎం కావడం ఇప్పటికే ఖరారైంది. కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి ఇప్పటికే ప్రకటించారు.
మరమరాల మహిమ.. దీదీ కోటను పిండి చేసిన మోదీ ‘జాల్ముడి’ మ్యాజిక్!
గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ ఉన్నది.(టీడీపీ,జనసేన, బీజేపీ) పార్టీ అధకారాన్ని పంచుకుంటున్నాయి. 2029 జమిలి ఎన్నికల్లో జాతీయ పార్టీలకు మైలేజ్ చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనగా ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేనలకు మరోసారి పదవీ గండం తప్పదని తెలుస్తున్నది. కూటమి సర్కార్ కొలువుదీరి రెండేండ్లు గడిచిపోయింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, మౌలిక సదుపాయాలన కల్పనలో వెనుకబడటం, ఆర్థిక లోటు సర్కారు కొట్టుమిట్టాడుతోంది.తమకు అధికారమిస్తే రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా నిలుపుతానని చంద్రబాబు ప్రకటించారు. రెండేండ్లు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. ప్రజల్లోకి బలంగా ఈ విషాయాన్ని తీసుకెళ్తున్నది.మరో రెండేండ్లలో రాష్ట్ర ముఖచిత్రం మారకపోతే తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో టీఎంసీ గతే కూటమికి పడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.