BigTV English

Gold Mining: మన తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు

Gold Mining: మన తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు

Gold Mining: భారతదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. ఆడవారికి అయితే గోల్డ్ అంటే మహా ఇష్టం. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం కొనాలంటే సామాన్యుడు భయపడిపోతున్నాడు. తులం బంగారం విలువ రూ.లక్ష ఉందంటే  రేట్లు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే వేలు, లక్షల కోట్ల ముడి బంగారం మన తెలుగు రాష్ట్రాల్లో నిక్షిప్తమై ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడా?

ఏపీలోకి కర్నూల్ జిల్లాలో బంగారు గనులు ఉన్నట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అలాగే, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూడా బంగారం గనులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.


కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతం, అనంతపురం జిల్లాలో రామగిరి, చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టు తెలుస్తోంది. జొన్నగిరి ప్రాంతంలో… దేశంలోనే తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్రాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. దీంతో.. ఇక్కడ బంగారం ప్రాసెస్ చేసే పరిశ్రమ ఏర్పాటు ఆగమేఘాల మీద చేసేందుకు ప్రైవేట్ సంస్ధలు ఆసక్తిగా ఉన్నాయి. 1994లోనే కర్నూలు జిల్లాలో గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో తేలింది. ఇక్కడి దాదాపు 1500 ఎకరాల్లో పసిడి నిల్వలు ఉన్నట్లు అనేక నివేదికల్లో వెల్లడైంది. దీంతో.. ఈ సంపదను వెలికి తీసేందుకు.. ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత 2005లో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజు ప్రక్రియను సరళీకరించింది. ఆ నిబంధనల మేరకు.. విదేశీ పెట్టుబడులతో పాటుగా ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు ఎదురుచూశాయి.

బెంగళూరుకు చెందిన దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. 2013లోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్స్ ప్రారంభించేందుకు ప్రైమరీ లైసెన్స్‌ను పొందింది. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అనుమతులు అవసరం కాగా.. అందుకోసం దాదాపు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. అలా.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్ వెల్స్ వేసి.. ట్రయల్స్ నిర్వహించిన సంస్థ.. మరికొన్నాళ్లలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్న సంస్థ.. జోన్నగిరిలో దాదాపు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టి వివిధ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం తన తరఫున చేయాల్సిన పనుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ALSO READ: Fake Gold: మార్కెట్లోకి ఫేక్ బంగారం.. గుర్తించకపోతే బుక్కైపోతారు

ఏపీలో కర్నూలుతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్నిచోట్ల బంగారం గనులను అధికారులు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే అవకాశం తమకు ఇవ్వాలని.. ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గుర్తించిన ఖనిజ సంపదను వెలికి తీస్తే.. రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని, అద్భుత ప్రగతికి దారులు పడతాయంటున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×