Abishan Jeevinth : నటుడు సూర్యకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా సూర్యను చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కూడా సూర్య సినిమాలను విపరీతంగా ఇష్టపడతారు. సూర్య చేసిన ఎన్నో సినిమాలు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే సూర్య అభిమానులు కూడా చాలామంది దర్శకులు అయ్యారు. అందులో యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ అభిషేన్ ఒకరు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన అభిషేన్ మంచి పేరును సాధించుకున్నాడు. ప్రస్తుతం టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.
సూర్య సినిమాకు పోటీగా
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా రెట్రో. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సూర్య ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఊహించారు కానీ అది జరగలేదు. అయితే ఇదే సినిమాకు పోటీగా రిలీజ్ అయింది టూరిస్ట్ ఫ్యామిలీ. దీనిపై దర్శకుడు స్పందిస్తూ.. నేను సూర్యకి పెద్ద అభిమానిని మే 1న సినిమాను రిలీజ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఓటిటి డీల్స్ వలన ఆ సినిమాను ఆ డేట్ కు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ సూర్య సినిమాకి టికెట్లు దొరకపోయినప్పుడు నా సినిమాకి వస్తారు అని ఊహించాను. అంతేకాకుండా కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా సినిమా చూస్తారు అనుకున్నాను. అంతేగాని సూర్య సినిమాకు పోటీగా విడుదల చేయలేదు. అంటూ చెప్పుకొచ్చారు.
అద్భుతమైన సినిమా
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు అభిషేన్. ముఖ్యంగా ఒక చిన్న పాయింట్ పట్టుకొని మనసుకు హత్తుకునేలా తీశాడు. కొన్ని సినిమాలు చూసిన కొన్ని రోజుల తర్వాత మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి అతి తక్కువ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల ఏడిపిస్తూ ఈ సినిమాని ఆధ్యాంతం నడిపిన విధానం ఎప్పటికీ మర్చిపోలేం. చాలా చిన్న ఏజ్ లో ఇంత అద్భుతమైన సినిమాను దర్శకుడు ఎలా తీసాడు అని చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో ఈ సినిమా కొనసాగుతుంది. త్వరలో ఈ సినిమా ఓటీటి లో విడుదల కానుంది. ఎస్ ఎస్ రాజమౌళి, రజినీకాంత్, సూర్య వంటి హీరోలు ఈ సినిమా పైన ఇదివరకే ప్రశంసలు కురిపించారు.