BigTV English

Jayam Ravi: రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కోలీవుడ్ హీరో.. అందుకే విడాకులా..?

Jayam Ravi: రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కోలీవుడ్ హీరో.. అందుకే విడాకులా..?

Jayam Ravi.. కోలీవుడ్ లో జయం సినిమాతో ఓవర్ నైట్ లోనే పాపులారిటీ సొంతం చేసుకున్న రవి. అదే సినిమాతో జయం రవి (Jayam రవి) గా మారిపోయి పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళ్ చిత్రాలతో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈయన, 18 సంవత్సరాల పాటూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి, సడన్ గా తన భార్య ఆర్తి (Arti) కి విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. నిజానికి గతంలోనే వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వచ్చినా.. ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఆర్తి. అయితే తాజాగా జయం రవి మాత్రం తాను తన భార్య నుంచి విడిపోతున్నానని, తనకు తన కుటుంబానికి ఈ విషయంలో ప్రైవసీ కావాలి అంటూ నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై స్పందించిన ఆర్తి తనకు తెలియకుండానే తన భర్త ఇలా బహిరంగంగా విడాకుల ప్రకటన చేయడం తనను మరింత మానసికంగా ఇబ్బందికి గురిచేసింది అంటూ తన బాధను వెల్లడించింది.


ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా..

మరోవైపు జయం రవి ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పాడు. కానీ ఆర్తి మాత్రం తనకు తన భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదని, అయితే తన అనుమతి లేకుండా ఇలా బహిరంగంగా విడాకులు ప్రకటించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇంత సడన్ గా జయం రవి తన భార్య ఆర్తి కి విడాకుల ప్రకటించడంతో.. అందరూ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ చేశారు.నిజానికి గతంలోనే వీరిద్దరికీ వివాహం జరిపించాలని చూశారు రజనీకాంత్. కానీ ఆర్తి, జయం రవి ప్రేమించుకోవడంతో వీరిద్దరికీ పెళ్లి చేసింది ఆర్తి తల్లి. కానీ సూపర్ స్టార్ కి అల్లుడైతే తన ఇమేజ్ మరింత పెరిగిపోతుందని ఆలోచించిన జయం రవి ఇప్పుడు భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేశాయి.


సింగర్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జయం రవి…

Jayam Ravi: Kollywood hero caught red-handed.. hence the divorce..?
Jayam Ravi: Kollywood hero caught red-handed.. hence the divorce..?

మరి ఈ వార్తలలో నిజా నిజాలు పక్కన పెడితే.. తాజాగా ఒక స్టార్ సింగర్ తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు జయం రవి. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సింగర్ కెనీషా (Keneeshaa ) తో జయం రవికి అక్రమ సంబంధం ఉందని, అందుకే విడాకులు తీసుకున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో జయం రవి గోవా వెకేషన్ కి వెళ్లారు. దీనికి తోడు జూన్ 4వ తేదీన జయం రవి – ఆర్తి ల పెళ్లి రోజు కూడా. అయితే ప్రతి ఏడాది తమ పెళ్లి రోజున ఎలాంటి షూటింగ్ జరిగినా సరే పట్టించుకోకుండా భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఉండే రవి, ఈసారి మాత్రం షూటింగ్ చేస్తున్నారని తెలిపారట. అయితే ఇక్కడ షాకింగ్ విషయం మరోటి ఏంటంటే.. నిషేధిత బ్లాక్ సన్ ఫిల్టర్ పేపర్ ను ఈయన కొనుగోలు చేసి కారుకు అంటించారని ఆరోజే పోలీసులు జరిమానా విధించారు.

భార్యను వదిలించుకోవడానికి కొత్త మార్గం..

అయితే ఈ కారు కాస్త ఆర్తి పేరు మీద ఉండడంతో నేరుగా ఆమెకు ఎస్ఎంఎస్ వెళ్ళింది. ఇది చూసి షాక్ అయిన ఆమె షూటింగ్ అని చెప్పి గోవా ఎందుకు వెళ్లారు అంటూ ప్రశ్నలు వేస్తూ గొడవకు దిగిందట. ఇక అప్పుడు రవి ఎవరితో ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయగా.. ఆర్తి తన సన్నిహితుల ద్వారా ఆరా తీస్తే కెనీషా పేరు బయటకు వచ్చిందట. అయితే ఆ సమయంలో కెనీషా తో పాటు చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పడంతో ఆమె కాస్త శాంతించింది. తర్వాత జూన్ 24 న జయం రవి కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని, అతివేగంగా నడుపుతున్నట్లు ఆర్తి మొబైల్ కు ఎస్ఎంఎస్ రాగా.. ఆమె చెక్ చేస్తే అక్కడ కెనీషా కారు నడుపుతున్నట్లు తేలింది. ఈ విషయాలను ఆమె నేరుగా గోవా వెళ్ళి ఆరా తీయగా.. ఎప్పుడు గోవా కి వస్తే ఆయన సాధారణంగా బస చేసే హోటల్లో కాకుండా.. కెనీషా తో కలిసి జయం రవి విలాసవంతమైన బంగ్లా ను కొనుగోలు చేసి అక్కడ ఉన్నట్లు వార్తలు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ విషయాలు తెలుసుకున్న ఈమె భర్తతో గొడవకు దిగడంతో, ఆమెను వదిలించుకోవడానికి విడాకులు ఇచ్చారు అంటూ కోలీవుడ్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×