Tirumala Hundi Record Collections : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఈ నెల కూడా 100 కోట్లు దాటింది. అక్టోబర్ నెల మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం 122.8 కోట్లు వచ్చింది. మార్చి నుంచి అక్టోబర్ వరకు వరుసగా ప్రతీ నెల హుండీ 100 కోట్లు దాటుతోంది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఆగస్టు నెలలో అధ్యధికంగా హుండీ ఆదాయం వచ్చింది. ఆగస్టు హుండీ ఆదాయం 140.34 కోట్లు. తిరుమల దేవస్థానం చరిత్రలో ఇంత ఎక్కువగా ఆదాయం ఎప్పుడూ రాలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు.
జులైలో కూడా హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో కలెక్ట్ అయింది. జులై హుండీ ఆదాయం 139.45 కోట్లు. ఇక 2018 జులై 26న ఆ ఒక్క రోజే శ్రీవారి హుండీకి.. 6.28 కోట్ల కానుకలు వచ్చాయి.
ఇక ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, ఈ మూడు కేంద్రాల్లో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేదల టోకన్లు.. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు ఇస్తారు. ఆధార్ కార్డుతో ఓసారి దర్శనం తరువాత నెలరోజుల వరకు మళ్లీ దర్శనం ఇవ్వరు. ఉచిత దర్శనం టోకెన్లు దొరకని భక్తులకు తిరుమల క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వ దర్శనానాకి అనుమతినిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.