BigTV English

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD Darshan Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎక్కువ సిరిసంపదలు కలిగి, ప్రతిరోజు వేలమంది కలియుగ దైవమైన.. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం.  వేల సంఖ్యలో భక్తులు.. స్వామివారిని దర్శించుకునేందుకు కంపార్ట్ మెంట్లలో బారులు తీరుతుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తుల కోసం ఆగష్టు నెలకు సంబంధించి ఆర్జిత సేవ, దర్శన టికెట్లు, వసతి గదులు కోటాను రిలీజ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి చెక్ చేసుకోండి.


జూన్-2025 కి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు బుకింగ్ కోసం 24.05.2025, ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

జూన్-2025 కి టిటిడి – స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్ కోసం 26.05.2025 ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.


జూన్-2025 కి సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు బుకింగ్ కోసం 26.05.2025 ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్లు 19.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 19.05.2025 ఉదయం 10:00 గంటల నుండి 21.05.2025 ఉదయం 10:00 గంటల వరకు తెరిచి ఉంటాయి.

ఆగష్టు-2025 కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) మరియు కనెక్ట్ చేయబడిన దర్శన కోటా బుకింగ్ కోసం 22.05.2025 మధ్యాహ్నం 3:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి శ్రీవాణి ట్రస్ట్ కు దర్శనం & వసతి కోటా (రూ. 10,000/-) దాతలకు 23.05.2025 ఉదయం 11:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి సీనియర్ సిటిజన్లు / శారీరకంగా వికలాంగుల కోటా బుకింగ్ కోసం 23.05.2025 మధ్యాహ్నం 3:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్లు బుకింగ్ కోసం 24.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు-2025 కి తిరుమల మరియు తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం 24.05.2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

Also Read: తిరుమలలో ఇక్కడంతా ఫ్రీ.. ఫ్రీ.. ఈ ప్లేస్ మిస్ కావద్దు!

ఇదిలా ఉంటే.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి వద్ద కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వెళుతున్న భక్తులు రద్దీ కనిపించింది. స్వామివారి దర్శనానికి టోకెన్లు లేకుండా 14 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడీ సమయం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

 

 

Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×