UM Rajnath Singh: భారత దేశం నుంచి ఈ ప్రపంచానికి సూటిగా ఒక ప్రశ్న. దుష్టదుర్గ, నీతిబాహ్య దేశం పాకిస్థాన్ చెంత అణ్వాయుధాలు ఉన్న మాట నిజమైతే.. ఆ దేశం దగ్గర ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలుండటం సమంజసమేనా? ఇలాంటి రోగ్ కంట్రీ దగ్గర ఇంతటి డేంజరస్ వెపన్స్ ఉండటం వల్ల.. ఈ ప్రపంచానికే ముప్పని మీకు తెలీదా? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏం చేస్తోంది??? ఇదీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సంధించిన ప్రశ్నాస్త్రం. ఆ ఫుల్ డీటైల్స్..
పాక్ చెంత అణ్వాయుధం కరెక్టేనా-రాజ్ నాథ్ ప్రశ్న
ఇంత జరుగుతుంటే IAEA ఏం చేస్తున్నట్టు???ఒక్క దెబ్బకు రెండు కాదు.. మూడు పిట్టలు. ఫస్ట్ వన్ యుద్ధాన్ని ఆపడం. సెకండ్ వన్ పాక్ దగ్గర అణ్వాయుధాలున్న చోటకు మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ దూసుకెళ్లడం. ఇక థర్డ్ వన్ ఒక వేళ కిరానా కొండల్లో అణ్వాయుధ నిల్వలుండటం వాస్తవమే అయితే.. ఇలాంటి నీచ్ కమీనే పాక్ లాంటి దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండటం కరెక్టేనా?
IAEA ఎందుకు పర్యవేక్షించదన్న రాజ్ నాథ్ సింగ్
మోసపూరిత దేశమైన పాక్ వంటి దేశం చెంత అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా? జమ్మూకాశ్మీర్ లో పర్యటించిన దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంధించిన ప్రశ్నాస్త్రమిది. పాక్ ఒక బాధ్యతారాహిత్యం గల దుష్టదేశం. అలాంటి దేశంలో అణ్వాయుధాలు ఉండటమేంటి? అంతర్జాతీయ అణు శక్తి సంస్త.. IAEA ఎందుకు పర్యవేక్షించదు? అణ్వాయుధాలను నిరోధించే ఈ సంస్థ.. పాకిస్థాన్ చెంత ఉన్న అణ్వాయుధాలను పర్యవేక్షించాలని రాజ్ నాథ్ పిలుపునివ్వడం ప్రస్తుతం పాక్ గుండెల్లో అణు ఒణుకు పుట్టేలా చేస్తోంది.
శ్రీనగర్ నేల మీది నుంచి ఈ ప్రపంచాన్ని అడుగుతున్నా..
శ్రీనగర్ నేల నుంచి ఈ ప్రపంచాన్ని నేనొకటి అడగాలనుకుంటున్నా.. అంటూ రాజ్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ అణుబెదిరింపులను ఇకపై భారత్ సహించదంటూ.. ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసగించిన కొన్ని గంటలకు రాజ్ నాథ్ నుంచి కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే రావడంతో.. అందరిలోనూ ఒక ఆలోచన మొదలైంది.
పాక్ అణు బెదిరింపులు మనం లెక్కించలేదు రక్షణమంత్రి
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి బదులిస్తుందో.. అందరూ చూశారు. వారి అణ్వాయుధ బ్లాక్ మెయిల్ గురించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సీరియస్ గా తీస్కోలేదు. తమ అణ్వాయుధ శక్తితో భారత్ ని ఢీకొడతామని పాక్ ఎన్ని సార్లు బెదిరించినా మనం లెక్కచేయలేదని అన్నారు రాజ్ నాథ్ సింగ్.
పాకిస్థాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేయలేదన్న భారత్
భారత్ దాడి కారణంగా పాకిస్థాన్ లోని కిరానా కొండల్లో అణు వికీరణం లీక్ అయ్యే అవకాశముందని ఇటీవల కొన్ని నివేదికలు హల్ చల్ చేశాయి. అయితే పాకిస్థాన్ లోని ఏ అణు కేంద్రాలనూ తాము టార్గెట్ చేయలేదంటూ భారత్ సైన్యం స్పష్టం చేసింది. కిరానా కొండల్లో పాక్ అణ్వాయుధాలను నిల్వ చేసిందని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. అక్కడ ఏముందో మాకు తెలీదు. మా లక్ష్యాల్లో ఆ ప్రదేశం లేదు. అంటూ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ మే 12న జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన అతి పెద్ద ఆపరేషన్
కిరానా కొండలపై భారత్ చేసిన దాడి నిజమే అయితే.. పాక్ లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండటం ఎంత వరకూ సమంజసమంటూ నిలదీశారు రాజ్ నాథ్ సింగ్. మే 7న ప్రారంభించి 10వ తేదీ ఆగిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిర్వహించిన అతి పెద్ద ఆపరేషన్ గా చెప్పారు రక్షణ మంత్రి రాజ్ నాథ్. గత నాలుగు దశకాలుగా భారత్ సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కుంఓంది. అలాంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఎక్కడి వరకైనా వెళ్లగలమని ఈ ప్రపంచానికి నిరూపించామని అన్నారు రాజ్ నాథ్ సింగ్.
ఉగ్రవాదులు మన నుదుటన గురి పెట్టారు…
పహెల్గాం దాడిలో ఉగ్రవాదులు పర్యాటకుల నుదుటిపై కాల్పులు జరిపారు. భారత్ ఉగ్రవాదులు గుండెలను గురి పెట్టి ప్రతీకారం తీర్చుకుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ వచ్చే రోజుల్లో ఇలాంటి దాడులు జరక్కుండా చూసుకోవాలంటే.. భారత్ ని టార్గెట్ చేసే టెర్రరిజాన్ని ఆపడం.. ఆ మట్టి నుంచి ఈ గడ్డకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండా చూడ్డం. ఇదీ పాక్ చేయాల్సిన పని అంటూ రాజ్ నాథ్ సూచించారు.
ఇకపై ఉగ్రవాదం సురక్షితంగా ఉండే ఛాన్స్ లేదు- రక్షణమంత్రి
పహెల్గాంలో ఉగ్రవాద దాడి చేసి భారత్ గౌరవాన్ని దెబ్బ తీశారు. భారత సామాజిక ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నం చేశారు. అలాంటి ఉగ్రవాదులు ఇకపై అంత సురక్షితంగా ఉండే అవకాశం లేదంటూ రాజ్ నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. వారిపుడు భారత సాయుధ దళాల నిఘా దృష్టిలో ఉన్నారనీ.. మన రక్షణ దళాలు ఎంత ఖచ్చితంగా దాడులు నిర్వహించగలవో.. ఈ ప్రపంచం ఇప్పటికే చూసిందని.. పాకిస్థాన్ కి మరింతగా తెలిసి వచ్చిందనీ అన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. మన ఆపరేషన్ సిందూర్ ద్వారా జరిగిన నష్టం ఏ పాటిదో శతృవులకే ఆ అంచనాలను వదిలి పెడుతున్నామని అన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్.
బాల్ ఆ కోర్టులోకి వేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్
తన మొత్తం ప్రసంగం ద్వారా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంధించిన అతి పెద్ద ప్రశ్న.. పాక్ వంటి నాశనకారి దేశంలో.. ప్రపంచ వినాశనకరమైన అణ్వాయుధాలు ఉండటం సమంజసమేనా? అంతర్జాతీయ అణు శక్తి సంస్త.. చూస్తూ ఊరుకుంది.. ఎందుకంటూ బాల్ ఆ కోర్టులో పడేశారు. ఇప్పటి వరకూ ఉన్న కథనాలను బట్టీ చూస్తే.. అమెరికా తన బీ- 350ని ఆ ప్రాంతానికి పంపడం.. దీనికి తోడు ఈజిప్ట్ నుంచి బోరాన్ తో మరో విమానం ల్యాండ్ కావడం చూస్తుంటే.. పాకిస్థాన్ కిరానా కొండల్లో జరగకూడని అణు వికీరణమేదో జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అలాంటి అణుశక్తి పాక్ దగ్గర ఉండటమే నిజమైతే.. IAEA ఏం చేస్తున్నట్టు??? ఇప్పుడిదే హాట్ టాపిగ్గా మారింది.
పాకిస్థాన్ కి మాములుగా యుద్ధం చేయడానికే సరైన శక్తి సామర్ధ్యం సరిపోదు. అలాంటి దేశానికి అణ్వాయుధం అవసరమా? అన్నది ఒక ప్రశ్న. కాగా… రెండో ప్రశ్న పాకిస్థాన్ లో అణు లీకేజీలు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ సాగుతోంది. ఒక పక్క భారత్ నుంచి తమకు అలాంటి దాడులు జరిగినట్టు తెలీదని.. తమకంటూ ఒక డాటా ఈ విషయంలో లేదనీ అంటారు భారత ఎయిర్ మార్షల్. మరికొన్ని నివేదికలను బట్టీ చూస్తే.. ఏపీ సింగ్ అంటూ ఒక అధికారిని హైలెట్ చేస్తూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం. ఇంతకీ అణుదాడి జరిగిందా? లేదా… ఆ అనుమాన నివృతి చేసుకోవడం ఎలా?
అలాంటి దాడులే జరగలేదంటోన్న ఏకే భారతీ
సమాధానం ఇవ్వాల్సి ఉన్న IAEAపాకిస్థాన్ కిరానా కొండల్లో అణు దాడి జరిగినట్టా లేనట్టా? ఇండియన్ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ చెప్పడాన్నిబట్టీ చూస్తే అలాంటి దాడులు తమ జాబితాలో లేవంటారాయన. సరిగ్గా అదే సమయంలో ఈ మొత్తం దాడులకు ఏపీ సింగ్ కర్త కర్మ క్రియ అంటూ మరో వార్త. పాకిస్థాన్ మిలటరీకి అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత వైమానిక దాడులు చేయాలన్న మాస్టర్ ప్లాన్ చేసింది ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ దే నంటాయి రక్షణ శాఖ వర్గాలు. ఈ ఎయిర్ బేస్ దాడికి ప్రణాళికలు రచించింది, అమలు చేసిందీ.. చివరికి పైలట్లను ఎంపిక చేసిందీ ఏపీ సింగేనంటారు వీరు.
ఏపీ సింగ్‌కి అజిత్ దోవల్ సపోర్ట్ ఉందన్న సమాచారం
ఈ మొత్తం దాడులు నిర్వహించిన ఏపీ సింగ్ కి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ మద్దతుగా నిలిచారని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కి తగిన అనుమతులిచ్చింది కూడా దోవలే అంటున్నారు. దాడులు జరిగినట్టు చెబుతున్న.. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో ఉంటుంది. దీనికి దగ్గర్లోని చక్లాలాలో పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం, న్యూక్లియర్ కమాండ్ కార్యాలయం సైతం ఉన్నాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేయడం ద్వారా తాము ఎక్కడైనా దాడి చేయగలమన్న సంకేతాలను పంపాలని భారత్ భావించినట్టుగా ఒక అంచనా. ఏపీ సింగ్ అనుకున్నట్టుగానే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ తో పాక్ వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటారు. అంతే కాదు పాక్ ఆర్మీ చీఫ్ మూడు గంటల పాటు బంకర్లో దాక్కున్నట్టుగానూ చెబుతున్నారు. ఈ దాడుల కోసం బ్రహ్మోస్ మిస్సైళ్లను వాడినట్టు కూడా తెలుస్తోంది.
మే 10 నుంచి సోషల్ మీడియా కథనాలు హల్ చల్
ఇవన్నీ ఇలాగుంటే మే 10వ తేదీ నుంచి ఈ దిశగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడం వెనక ఈ దాడులున్నాయని సోషల్ మీడియా జనాలు ఒకటే కథనాలు వండివార్చుతున్నారు. పాకిస్థాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని వీరు తెగేసి చెబుతున్నారు. అందుకు తగిన ఎవిడెన్సులు కూడా చూపెడుతున్నారు. సర్గోధా.. ఎయిర్ బేస్ కి దగ్గర్లో కిరానా హిల్స్ ఉంటాయి. ఈ కొండల ప్రాంతంలో పాకిస్థాన్ న్యూక్లియర్ సెంటర్ ఉంది. భారత్ తన క్షిపణులతో సర్గోధా, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై దాడి చేసింది. దీంతో పాక్ అణు రియాక్టర్ల నుంచి రేడియేషన్ లీక్ అవుతోన్నట్టు కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఈ కథనాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ వెళ్లాయంటే.. స్థానికుల్లో కొందరికి వాంతులు, తలనొప్పి రావడం.. ఊపిరాడక పోవడం.. వంటి వాటితో బాధ పడుతూ.. ఆస్పత్రి పాలయ్యారనీ.. పాక్ ఆర్మీ అధికారులు ఈ విషయాలను బయటకు పొక్కకుండా ఆపుతున్నారనీ నెటిజన్ల కామెంట్ల ద్వారా తెలుస్తోంది.
అణు స్టావరాల్లో రసాయన చర్యల నిరోధానికి వాడే బోరాన్
ఇక్కడ మరో కీలకమైన ఎవిడెన్స్ ఏంటంటే.. ఈజిప్ట్ కి చెందిన బోరాన్- 10 ఐసోటోప్ తో మంగళవారం ఉదయం పాకిస్థాన్ కి చేరుకున్న వార్తలు అందుతున్నాయి. అణుస్థావరాల్లో రసాయన చర్యలను నిరోధించడానికి ఈ బోరాన్ని వినియోగిస్తారు. అలాంటి రసాయనం పాక్ కి అవసరమేర్పడిందంటే.. రేడియేషన్ లీకేజీ జరగటం నిజమే అన్నది మరో వాదన. మరో ముఖ్యమైన ఆధారమేంటంటే.. ఫ్లైట్ రాడార్-24 వంటి ట్రాకర్ వెబ్‌సైట్లలో అమెరికాకు చెందిన బీ-350 విమానం పాకిస్థాన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విమానం ఒక చోట ల్యాండ్ అయితే అక్కడ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఏర్పడ్డట్టు లెక్కిస్తారు. ఒక ప్రాంతంలో వెలువడే అణుధార్మికత తీవ్రతను గుర్తించే సాంకేతిక పరికరాలు ఈ విమానంలో ఉంటాయి. పుకుషిమా ఉదంతంలోనూ ఈ విమానం జపాన్‌కు వెళ్లినట్లు గుర్తుచేసింది ఎకనామిక్ టైమ్స్.
పాకిస్థాన్ అణు కేంద్రాల నుంచి నో.. రేడియేషన్ లీక్-IAEA
ఇవన్నీ ఇలా ఉంటే.. పాకిస్థాన్ అణు కేంద్రాల నుంచి ఏ రేడియేషన్ లీక్ కాలేదని అంటోంది.. ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా.. పాకిస్థాన్ లో అలాంటిది జరిగినట్టు తమకు తెలియడం లేదని అంటోందీ సంస్థ. గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్ గా పని చేస్తుంది ఐఏఈఏ. అలాంటి సంస్థకు కూడా సమాచారం లేక పోవడాన్ని ఏమనాలి? అన్నది మరో ప్రశ్న. భారత్- పాక్ అనే రెండు అణ్వాయుధ దేశాల మధ్య సంఘర్షణ నివారించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు. అయితే ఈ వాదన తోసి పుచ్చారు.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిథి రణధీర్ జైస్వాల్. భారత సైనిక చర్య ట్రెడిషనల్ డొమైన్లోనే జరిగిందంటూ ఈ అణు యుద్ధపు ఊహాగానాలను ఖండించారాయన.
Also Read: నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే పదవి ఇదే!
అణుధార్మిక లీకేజికి చెందినదే-CNN కథనం
అమెరికాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్.. అణుధార్మిక లీకేజీకి సంబంధించినదే అయి ఉంటుందని ఒక కథనాన్ని ప్రసారం చేసింది సీఎన్ఎన్. భారత్ దాడులతో భారీగా దెబ్బ తిన్న పాకిస్థాన్ మే పదో తేదీన మధ్యాహ్నం ఢిల్లీ టార్గెట్ గా.. ఫతాహ్ అనే క్షిపణి ప్రయోగించిందని.. ఇండియన ఆర్మీ దీన్ని భారత సరిహద్దుల్లోనే కూల్చేసిందనీ అంటారు మాజీ మిలటరీ అధికారి జీడీ భక్షి. వారి దగ్గరున్న టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్ తోనే ఈ మిస్సైల్ వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నట్టుగా చెప్పారు భక్షి.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి మరో లాజిక్
తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరో రకమైన కొత్త లాజిక్ లాగారు. ఒక వేళ పాక్ చెంత అలాంటి ప్రమాదకరమైన ఆయుధాలుంటే.. వాటిని ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎందుకు పర్యవేక్షించదు? అన్న ప్రశ్నను సంధించారు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ కాబట్టి.. ఇలాంటి దేశం చెంత అణ్వాయుధాలు ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ ప్రపంచానికి స్పష్టంగా తెలుసుకాబట్టి.. ఇది సరైనదేనా? అంటూ రక్షణ మంత్రి వేసిన ప్రశ్నకు IAEA నుంచి సమాధానం రావల్సి ఉంది. మరి చూడాలి.. ఈ సంస్థ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో.