E-Paper
Advertisement

ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!
Advertisement

Tirupati BJP Leader: తిరుపతి బీజేపి నేత బైక్‌ను తగలబెట్టిన ఘటనను విచారించిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఆస్తి నష్టం కేసుగా ప్రారంభమైన ఈ విచారణ.. చివరికి ఓ పక్కా హత్య కుట్రను బయటపెట్టింది. సొంత భర్తనే కడతేర్చేందుకు భార్యే ఇతర నిందితులతో కలిసి ప్లాన్ వేసినట్లు తేలడంతో ఆమెతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సాధారణ కేసుగా మొదలై..

సెప్టెంబరు 13 రాత్రి బీజేపి మండల అధ్యక్షుడు మునిరాజుకు చెందిన మోటార్ సైకిల్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీనిపై మునిరాజు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా పోలీసులు దీనిని సాధారణ ఆస్తి నష్టం కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఫ్లెక్సీల వివాదం కారణంగానే ఏవైనా రాజకీయ విబేధాలతో ఈ పని చేశారా? అన్న కోణంలో పోలీసులు మొదట విచారించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పురోగతి

Advertisement

దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను, సాంకేతిక ఆధారాలను కూలంకషంగా పోలీసులు పరిశీలించారు. వీటి ఆధారంగా సాయి, ఉదయ్ కిరణ్, లీలా కృష్ణ, పృథ్వీరాజ్, హరీష్ అనే ఐదుగురు యువకులను గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తామే ఆ బైక్‌కు నిప్పు పెట్టినట్లు వారు అంగీకరించారు. అయితే వారిని తమదైన శైలిలో పోలీసులు మరింత లోతుగా ప్రశ్నించగా ఈ కేసును అనూహ్య మలుపు తిప్పే వాస్తవాలు బయపడ్డాయి.

తెరపైకి మునిరాజు భార్య కుట్ర

ఈ ఘటన వెనుక మునిరాజు భార్య ప్రశాంతి ప్రమేయం ఉన్నట్లు నిందితులు చెప్పడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిందితుల్లో ఒకరైన సాయితో ప్రశాంతికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి.. అది కాస్త సన్నిహిత బంధంగా మారింది. ఆమె సోషల్ మీడియా చాటింగ్స్, కాల్ డేటాను పరిశీలించగా భర్తకు సంబంధించిన ప్రతి కదలికను ఆమె సాయితో పంచుకున్నట్లు తేలింది. మునిరాజును కడతేర్చేందుకు వీరంతా కలిసి పలుమార్లు ప్లాన్లు వేసినట్లు ఆధారాలు లభించాయి.

Advertisement

Also Read: ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

రిమాండ్‌కు నిందితులు

గతంలో కూడా అనేకసార్లు మునిరాజుపై దాడికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ కుట్రలు అమలు కాలేదని పోలీసులు గుర్తించారు. ఆ కుట్రలో భాగంలోనే ఈ బైక్ దహనం ఘటన కూడా జరిగినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన భార్య ప్రశాంతితో పాటు సాయి, ఉదయ్ కిరణ్, లీలా కృష్ణ, పృథ్వీరాజ్, హరీష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Also Read: కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

Tags

Related News

ఆంధ్రా బిడ్డగా నన్ను భావించండి.. ఏం చెయ్యాలో చెప్పండి, తెలుగులో మాట్లాడిన అనంత్ అంబానీ

అన్నయ్యా బాబాయ్ కేసు.. ఈడీ పిలిచారు, ఇప్పుడు ఏం చేద్దాం, వైసీపీలో నేతల ఉక్కిరి బిక్కిరి

అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?

నాడు జగన్, నేడు చంద్రబాబు.. బీసీల విషయంలో ఇద్దరూ వెన్నుపోటు దారులే: వైఎస్ షర్మిల!

బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామా: బోత్స సత్యనారాయణ!

గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!

బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర!

Big Stories

Advertisement
×