E-Paper
Advertisement

బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామా: బోత్స సత్యనారాయణ!

బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామా: బోత్స సత్యనారాయణ!
Advertisement

BC Reservations: బీసీలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపాడని బోత్స సత్యనారాయణ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయించాలని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంది కదా మరి బీసీలకు న్యాయం చేయడానికి అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై న్యాయపరమైన పరిస్థితి తెలిసినా 34 శాతం పేరుతో బీసీలను ఎందుకు మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.

తప్పుడు ప్రచారాలు ఎందుకు..?

మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామనడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టబద్ధమైన పరిష్కారం చూపండిని అన్నారు. బీసీల మనోభావాలతో రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలని, బీసీ రిజర్వేషన్లను వైఎస్సార్‌సీపీ అడ్డుకుందని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది? ఆధారాలు చూపాలని అన్నారు. కోర్టుల తీర్పులకు వైఎస్సార్‌సీపీని బాధ్యులను చేయడం ఏంటి? రాజ్యాంగపరమైన అంశాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బోత్స అన్నారు.

Advertisement

Also Read: భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

ఎందుకు ప్రశ్నించడం లేదు?

బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ, కూటమిలోని బీసీ నేతలు తమ నాయకత్వాన్ని పార్లమెంట్‌లో పరిష్కారం కోసం ఎందుకు ప్రశ్నించడం లేదు? బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కూటమిలోని బీసీ నేతలు కూడా గళమెత్తాలని, రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల రాజకీయాలకు ఉపయోగించుకోవడం సమంజసం కాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా మార్చొద్దని, 1994లోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందరి బోత్స క్లారిటీ ఇచ్చారు.

సున్నితమైన అంశం..

Advertisement

అంతా తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం చరిత్రను వక్రీకరించడమేనని, బీసీలకు 34 శాతం తానే ఇచ్చానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సరికాదని అన్నారు. ప్రతి సున్నితమైన అంశాన్నీ రాజకీయ కోణంలో చూడటమే చంద్రబాబు విధానం. బీసీ సోదరులు చంద్రబాబు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలని బోత్స అన్నారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని, బీసీల ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన, న్యాయపరంగా నిలబడగల పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Also read: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. సంచలన తీర్పు ఇచ్చిన మేడ్చల్ కోర్టు!

Tags

Related News

గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!

బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తాం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర!

జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సీఎం చంద్రబాబు.. సర్వే వివరాలు వైసీపీలో వణుకు మొదలు

హైకోర్టులో వైసీపీకి ఊహించని షాక్..ఆరు వారాల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై జీవోల కొట్టివేత

జగన్.. అసలు ‘రెడ్డి’ కాదు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్‌తో ఎన్నికలకు జగన్, నా ప్రమేయం ఏ మాత్రం లేదు

మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

Big Stories

Advertisement
×