E-Paper
Advertisement

మురళీధరన్ కుట్ర వ‌ల్ల‌..గారీ క్రిస్టెన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు

మురళీధరన్ కుట్ర వ‌ల్ల‌..గారీ క్రిస్టెన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు
Advertisement

Muralitharan Takes Pragyan Ojha  : శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కారణంగా తనను గారీ క్రిస్టెన్ బండ బూతులు తిట్టాడని ప్రగ్యాన్ ఓజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను ఔట్ చేసి, ముత్తయ్య తన కెరీర్ లో 800 వికెట్ల మైలురాయిని అందుకున్నాడని గుర్తు చేసారు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ లో ఎందుకు అవుట్ అయ్యావని మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… గంటసేపు తనకు గారీ క్రిస్టెన్ క్లాస్ పీకాడని వెల్లడించారు. 2010 సంవత్సరంలో గాలే వేదికగా శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇదే ముత్తయ్య మురళీధరన్ కెరీర్ లో చివరి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ప్రగ్యాన్ ఓజాను పెవిలియన్ కు పంపి 800 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు ముత్తయ్య మురళీధరన్. అయితే స్పిన్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కునే టీమిండియా పైన మురళీధరన్ రికార్డు సృష్టించి… రిటైర్మెంట్ ప్రకటించడం అవమానంగా భావించిన గారీ క్రిస్టెన్… డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన ఓజాను బండ బూతులు తిట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓజా, బయట పెట్టారు.

ఇంతకు ఓజాను ఎందుకు తిట్టాడంటే?

2010 సంవత్సరంలో శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ ప్రారంభం కాక ముందు ముత్తయ్య మురళీధరన్ ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. ఆ తర్వాత గాలి వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మురళీధరన్ కెరీర్ లోనే చివరిది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ముత్తయ్య మురళీధరన్ 8 వికెట్లు పడగొట్టి…800 ల మార్క్ దాటేశాడు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

అయితే 799 వికెట్లు ఉన్న సమయంలో…. క్రీజులో ఓజా, ఇశాంత్ శర్మ ఉన్నారు. స్ట్రైకింగ్ లో ప్రగ్యాన్ ఓజా ఉన్నాడు. ఈ క్రమంలో ముత్తయ్య మురళీధర్ అని వేసిన ఓ అద్భుతమైన బంతికి టెంప్ట్ అయిన ఓజా… స్లిప్ లో క్యాచ్ ఇచ్చి, ఔట్ అయ్యాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక గ్యారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీధరన్ బౌలింగ్ లో ఎందుకు అవుట్ అయ్యావని ఓజాను నిలదీశారు. డ్రెస్సింగ్ రూమ్ లో దాదాపు గంట పాటు ఇదే విషయంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు స్వయంగా ఓజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

2011 వన్డే వరల్డ్ కప్ విజయం వెనుక గారీ క్రిస్టెన్

Advertisement

2011 వన్డే వరల్డ్ కప్ విజయానికి మహేంద్రసింగ్ ధోని ఎంత కష్టపడ్డాడో… తెర వెనుక హెడ్ కోచ్ గారీ క్రిస్టెన్ కూడా అంతే కష్ట పడ్డారు. జట్టును బలంగా తయారు చేసి… టైటిల్ గెలిచేలా సిద్ధం చేశారు. ఆ తర్వాత టీమిండియా కు గుడ్ బై చెప్పిన ఆయన.. మరో జట్టు హెడ్ కోచ్ గా పని చేశారు. మహేంద్రసింగ్ ధోని అలాగే గారీ క్రిస్టెన్ ఇద్దరు కలిసి పని చేసి, టీమిండియాను నెంబర్ వన్ గా నిలిపారు.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

ఒకటి కాదు రెండు కాదు.. టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య 5 మ్యాచ్ లు, ఇదిగో షెడ్యూల్

రఘు లేకుంటే, టీమిండియా సంకనాకి పోయేది… విరాట్ కోహ్లీ సంచలనం!

సైమ్ అయూబ్ తో జాగ్ర‌త్త‌, టీమిండియా తాట తీస్తాడు…ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చుతున్నాం..కానీ గిల్‌కు కూడా మనోడు సరిపోవడం లేదు

0,0,0,0,0 ఐదుగురు డకౌట్స్…లంక ఓటమి, ఫైనల్స్‌కు దూసుకెళ్లిన టీమిండియా

ఒరేయ్ దద్దమ్మ… ఫ్లాట్ ట్రాక్స్‌పై తప్ప, విదేశీ పిచ్‌లపై ఇంకెప్పుడు ఆడతావ్ ?

పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ ఊతకోత…పగిలిపోయిన డ్రెస్సింగ్ రూం అద్దాలు

Big Stories

Advertisement
×