E-Paper
Advertisement

అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!
Advertisement

OnePlus BeaconLink: చిన్నప్పుడు బొమ్మ ఫోన్ చేతిలో పట్టుకుని ‘ఓవర్ అండ్ అవుట్’ అంటూ వాకీటాకీతో మాట్లాడుతున్నట్టు నటించడం గుర్తుందా? అప్పట్లో ఫోన్ సిగ్నల్ లేదు, ఇంటర్నెట్ లేదు.. అయినా దూరంగా ఉన్న ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకోవడంలోనే ఓ రకమైన కిక్కు ఉండేది. ఇప్పుడు ఆ సరదా కాస్త నిజంగానే మన స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేసింది. మీ దగ్గర OnePlus లేదా OPPO స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా, Wi-Fi అందుబాటులో లేకపోయినా, దగ్గర్లో ఉన్న మరో ఫోన్‌తో నేరుగా వాయిస్ కాల్ చేసుకునే అవకాశం ఉంది. అదీ ఎలాంటి మొబైల్ డేటా లేదా రీఛార్జ్ అవసరం లేకుండా!

ఏమిటీ కొత్త టెక్నాలజీ?

వన్‌ప్లస్, ఒప్పో కంపెనీలు తమ కొత్త ఆక్సిజన్ ఓఎస్ 15 అప్‌డేట్‌తో ‘బీకాన్‌లింక్’ అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను పరిచయం చేశాయి. దీని సహాయంతో సెల్యులార్ నెట్‌వర్క్ లేదా వైఫై కనెక్షన్ అసలు లేకపోయినా కూడా మనం వేరే వాళ్లతో హ్యాపీగా మాట్లాడవచ్చు. ఇది బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తూ.. దాదాపు 200 మీటర్ల పరిధిలో ఉన్న మిగతా ఫోన్లకు సులువుగా కనెక్ట్ అవుతుంది.

Advertisement

Also Read: పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

ఎక్కడ ఉపయోగపడుతుంది?

మనం తరచూ క్రౌడ్ ఎక్కువ ఉండే సంగీత కచేరిలు, పెళ్లిళ్లు లేదా పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్తుంటాం. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా అందక ఫోన్ కాల్స్ కలవవు. అలాగే కొండలు, అడవుల్లో ట్రెకింగ్ లేదా క్యాంపింగ్‌కు వెళ్లినప్పుడు నెట్‌వర్క్ అసలే ఉండదు. ఇటువంటి అత్యవసర సమయాల్లో మీ గ్రూప్ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఈ బీకాన్‌లింక్ ఒక వరంలా పనిచేస్తుంది. ఎలాంటి సిగ్నల్ లేకపోయినా మెసేజ్‌‌లు, కాల్స్ చేసుకునే వెసులుబాటు ఇస్తుంది.

కొన్ని పరిమితులూ ఉన్నాయ్:

Advertisement

అయితే ఈ ఫీచర్‌లో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఇది కేవలం ఆక్సిజన్ ఓఎస్ 15పై నడిచే వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ లేదా వేరే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ ట్రిక్ వర్కవుట్ అవ్వదు. ఇద్దరి దగ్గరా ఈ కొత్త సాఫ్ట్‌‌వేర్ ఉన్న ఫోన్లు ఉంటేనే ఈ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది.

ఎలా ఆన్ చేసుకోవాలి?

ఈ ఫీచర్‌ను వాడుకోవడం చాలా తేలిక. ముందుగా మీ ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘మొబైల్ నెట్‌వర్క్’ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. అక్కడ మీకు ‘బీకాన్‌లింక్’ అని కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మీకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఆక్సెస్ ఇచ్చేలా ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. మీ ఇంట్లో అందరూ వన్‌ప్లస్ ఫోన్లు వాడుతుంటే భద్రత పరంగా ఇది నిజంగా చాలా మంచి ఫీచర్.

Also Read: యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. iPhone Duo సేల్ డేట్ ఇదే!

Tags

Related News

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

వన్‌ప్లస్ కొత్త ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?ఇంట్లోనే ఇలా రీసెట్ చేసుకోండి!

ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

Big Stories

Advertisement
×