Anantapur district: రన్నింగ్ ట్రైన్ ఎక్కువుతున్న సమయంలో ప్రయాణికుల ఘటనలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి. తేడా వస్తే మనిషి ఈ లోకాన్ని విడిచి పెట్టినట్టే. కాకపోతే కొందరు అదృష్టవశాత్తూ బయటపడిన సందర్భాలు ఉంటాయి. తాజాగా అలాంటి ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఆ కానిస్టేబుల్ లేకుంటే ఆ ప్రయాణికులు ఈపాటికి లోకాన్ని విడిచి పెట్టేవాడు.
అనంతపురం జిల్లా రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 29న సరిగ్గా సమయం ఉదయం 9 గంటలు అవుతోంది. అప్పుడే స్టేషన్ నుంచి రైలు మూవ్ అవుతోంది. ఆ మయంలో భైరవనగర్‌కు చెందిన 49 ఏళ్ల రవికుమార్ రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒక చేత్తో ట్రైన్ డోర్ తలుపు హ్యాండిల్ పట్టుకుని ఎక్కే సమయంలో పట్టు తప్పాడు. అతడు కాళ్లు మాత్రమే రైలులో ఉన్నాయి. ఆయన బాడీ మొత్తం ఫ్లాట్ ఫారమ్‌పై వేలాడుతోంది.
అదే సమయంలో పని నిమిత్తం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై ఉన్న నగరానికి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సురేంద్ర.. ఆ సన్నివేశాన్ని క్షణాల్లో స్పందించారు. ప్రయాణికుడి వైపు శరవేగంగా దూసుకెళ్లి ఆయన, ప్రయాణికుడు షర్ట్ కాలర్‌ను పట్టుకున్నారు. హ్యాండిల్ వదిలెయ్ అంటూ బిగ్గరగా అరిచాడు. చివరకు ప్రయాణికుడు రవికుమార్‌ను ప్లాట్‌ఫారంపైకి బలంగా లాగారు. దీంతో ప్రయాణికుడికి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సన్నివేశం కేవలం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.
చివరకు ప్రయాణికుడు సేఫ్‌గా బయటపడ్డాడు. ఆ షాక్ నుంచి తేరుకున్న రవికుమార్, కానిస్టేబుల్ సురేంద్ర కాళ్లమీద పడి మీరు నా ప్రాణం కాపాడిన దేవుడు సార్ అని కృతజ్ఞతలు తెలిపాడు. స్టేషన్‌లో ఉన్న పలువురు ప్రయాణికులు కానిస్టేబుల్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ALSO READ: పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు
ఈ ఘటన గురించి తెలియగానే ఎస్పీ జగదీశ్.. కానిస్టేబుల్ సురేంద్రను తన చాంబర్‌కు పిలిపించి అభినందించారు. శాలువ కప్పి కానిస్టేబుల్‌ను సన్మానించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రాణాలను ధైర్యంగా కాపాడావని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్క పోలీసు ఇలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు జిల్లా ఎస్పీ.