Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థును దూరంగా తీసుకెళ్లి చంపేయాలని ప్లాన్ చేసిన మనోహరి హనీమూన్ పేరు చెప్పి కులుమనాలి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లాక ఒక హోటల్‌లో రూం తీసుకుంటారు. తర్వాత సైట్ సీయింగ్‌కు వెళ్లాక పార్థును ఏదో ఒక దగ్గర లోయలోకి తోసేసి చంపేయాలని మనోహరి ప్లాన్ చేసుకుంటుంది. పార్థు మాత్రం హోటల్ మేనేజర్‌తో తాము సైట్ సీయింగ్ కు వెళ్లాలి వెహికిల్ కావాలని అడిగితే.. హోటల్ మేనేజర్ సీతారం అనే వ్యక్తిని పిలిచి ఇతను సీతారం సార్ మీకు డ్రైవర్ కమ్ గైడ్. ఇక్కడ లోకల్ ప్లేసెస్ అన్ని సీతారం మీకు చూపిస్తాడు. అలాగే రూం సర్వీస్ కూడా మీకు సీతారామే చూసుకుంటాడు అని చెప్తాడు.
మనోహరి మాత్రం అయ్యో వీడు ఉంటే పార్థును ఎలా చంపగలను.. ఇక ఈ టూరే వేస్ట్ అవుతుంది అని మనసులో అనుకుంటుంది. వెంటనే పార్థు మనకు ఏ వెహికిల్ వద్దు ఏ డ్రైవర్ వద్దు ఇక్కడి ప్లేసెస్ మనం నడుచుకుంటూ వెళ్లి చూద్దాం అప్పుడే చూసిన శాటిపై అవుతుంది అని మనోహరి చెబితే.. ఇదేమైనా పార్క్ అనుకున్నారా..? మేడం.. ఇదో పెద్ద హిల్ స్టేషన్.. ఇక్కడ వెహికిల్ మీద వెళ్లి అన్ని ప్లేసెస్ చూడాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. ఇక మీరు నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడు చూస్తారు.. ఎన్ని చూస్తారు అని సీతారం చెప్తాడు. మేనేజర్ కూడా అవును మేడం సీతారం చాలా మంచి గైడ్ మీకు అన్ని ప్లెసెస్ తక్కువ టైంలో కవర్ చేస్తాడు అని చెప్తూ.. సీతారం సార్ వాళ్లు హనీమూన్‌కు వచ్చారు. ఆ హనీమూన్ రూం ఉంది కదా అదివ్వు సార్ వాళ్లకు అంటూ మేనేజర్ కీస్ తీసి సీతారంకు ఇస్తాడు.
సీతారం లగేజీ తీసుకుని పార్థు వాళ్లను రూంకు తీసుకెళ్తూ.. సార్ నేను ఇక్కడ పదేళ్ల నుంచి పని చేస్తున్నాను. మీరు వెళ్లినప్పుడు నాకు మంచి రేటింగ్ ఇవ్వాలి అని చెప్తాడు సీతారం. రేటింగే కాదు మంచి టిప్పు కూడా ఇస్తాను అని పార్థు చెబితే.. టిప్పు ఏముంది సార్ మీరు మళ్లీ మళ్లీ మా హోటల్ కు రావాలి అదే నాకు సంతోషం అంటూ చెప్తుంటే.. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌గా వీడు పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడు.. వీన్ని వదిలించుకోవడం ఎలా అని ఆలోచిస్తుంది. సీతారం రూంలోకి తీసుకెళ్లి రూం ఎలా ఉంది సార్ అని అడిగితే.. పార్థు బాగానే ఉంది అంటాడు.
మీ ఫస్ట్ నైట్ ఎప్పుడో చెబితే రూం డెకరేట్ చేస్తాను సార్ అంటాడు సీతారం. మనోహరి కోపంగా మా ఫస్ట్ నైట్ అయిపోయింది ఇక నువ్వు వెళ్లు అనగానే.. సీతారం ఏమైనా అవసరం వస్తే బెల్ నొక్కండి సార్ వస్తాను అంటూ సీతారం వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన సీతారంను ఆపేసిన పార్థు దగ్గరకు వెళ్లి ఇవాళ మా సెకండ్ నైట్ రూం డెకరేట్ చేస్తావా..? అని అడిగితే.. చేస్తాను.. సార్ మీరు మేడం ప్రెష్ అయి గార్డెన్‌లో వెయిట్ చేయండి నేను రూం డెకరేట్ చేస్తాను అంటూ వెళ్లిపోతాడు. సీతారంతో గుసగుసలు మాట్లాడిన పార్థును మనోహరి అనుమానంగా చూస్తుంది. వాడితో ఏం చెప్పావు పార్థు అని అడుగుతుంది. ఏదో చెప్పాను కానీ ముందు ప్రెషప్ అవ్వు అంటాడు పార్థు సరే అంటూ వెళ్తుంది మనోహరి.
పార్థు, మనోహరి ఢిల్లీ వెళ్లలేదన్న విషయం అమర్ ఎలా చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటారు రాథోడ్, మిస్సమ్మ. కానీ ఎలాగైనా చెప్పాలని డిసైడ్ అవుతారు. కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ఫోన్ లో వాయిస్ చేంజ్ చేసి రాథోడ్ మాట్లాడతాడు. నీ ఫ్రెండ్ పార్థు ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. పార్థుకు నాకు పాత లెక్కలు ఉన్నాయి. అవి తేల్చుకోవాలని అటాక్ చేస్తే.. నువ్వు సేవ్ చేశావు. కానీ ఇప్పుడు ఢిల్లీలో రేపు పార్థును నేను చంపేస్తాను అంటూ చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.