E-Paper
Advertisement

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య
Advertisement

Vijayawada: అనుమానం పెనుభూతం అయ్యింది. ఫ్యామిలీలో ఏమైనా చిన్ని చిన్న సమస్యలుంటే భార్యాభర్తలు కూర్చొని చర్చించుకుంటే బాగుండేది. కానీ భార్యపై అనుమానం పడ్డాడు. చివరకు భర్త వేధింపులు తట్టకోలేక కృష్ణాజిల్లాలో తల్లి-కూతురు-కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?

కృష్ణా జిల్లాలో దారుణం.. ఓ ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య

Advertisement

కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటకు చెందిన అనుముకొండ కృష్ణ-రజనీకుమారి దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు దేవచంద్రరాజు-గౌరి పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు కిందట వారిద్దరికీ వివాహం చేశారు. కూతురు గౌరి ఫ్యామిలీ కత్తలవారిపాలెంలో నివాసం ఉంటోంది. కొడుకు దేవచంద్రరాజు.. దగ్గర బంధువు కూతురు నరసన్నపాలేనికి చెందిన మధుబాలతో వివాహం జరిపించారు.

దేవచంద్రరాజు-మధుబాల దంపతులకు కొడుకు-కూతురు ఉన్నారు. సీన్ కట్ చేస్తే.. పుట్టింటికి తరచూ వచ్చేది కూతురు గౌరి. తల్లి, వదినతో సరదాగా ఉండేది. వీరిని చూసి ఊరు ప్రజలు ఆడిపోసుకునేవారు. తమకు అలాంటి కూతురు, కోడలు ఉంటే బాగుండేదని భావించేవారు ఇరుగుపొరుగువాళ్లు. కొన్నాళ్లుగా దేవచంద్రరాజు.. తన భార్య మధుబాలను అనుమానించడం మొదలుపెట్టాడాడు.

Advertisement

అత్త-కోడలు-కూతురు..  వివరాలు సేకరిస్తున్న పోలీసులు

అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. ఆ తర్వాత వేధించడం మొదలుపెట్టాడు. కొడలకు వత్తాసు పలుకుతున్నారంటూ తల్లి-చెల్లిని దుర్భాషలాడేవాడు దేవ చంద్రరాజు. రోజు రోజుకూ కొడుకు వేధింపులు తట్టుకోలేక వారం కిందట తల్లి రజనీకుమారి, కొడలు మధుబాల, చెల్లి గౌరి గూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారం చివరకు ఊరు పెద్దల వరకు వెళ్లింది. కొద్దిరోజులపాటు గ్రామంలో వేరుగా ఉండాలని దేవచంద్రరాజుకు సూచించారు. రెండు రోజుల కిందట గౌరి పుట్టింటికి వచ్చింది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముగ్గురు మహిళలు గదుల్లో చున్నీలతో ఉరేసుకున్నారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ALSO READ:  బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెనుక కుటుంబ కలహాలు-ఆర్థిక ఇబ్బందులు- వ్యక్తిగత సమస్యలు అనేదానిపై సమగ్ర విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Related News

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!

ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు

Big Stories

Advertisement
×