E-Paper
Advertisement

మనుషుల్ని పీక్కుతినే జాంబీకి అమ్మాయిపై ప్రేమ… ఇలాంటి రొమాంటిక్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

మనుషుల్ని పీక్కుతినే జాంబీకి అమ్మాయిపై ప్రేమ… ఇలాంటి రొమాంటిక్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా
Advertisement

Romantic zombie comedy : మనుషులంతా జాంబీలుగా మారిపోయిన ప్రపంచంలో… ఓ జాంబీకి ఒక అమ్మాయిపై ప్రేమ పుడితే ? ఆమెను తినాల్సిన జాంబీనే కాపాడాలని నిర్ణయించుకుంటే ? వినడానికి వింతగా ఉన్నా… ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన డిఫరెంట్ రొమాంటిక్ జాంబీ కామెడీ ‘వామ్ బాడీస్’ (Warm Bodies). సాధారణ జాంబీ సినిమాల్లో కనిపించే భయం, రక్తపాతం కాకుండా… ఈ సినిమాను ప్రేమ, హ్యూమర్, ఎమోషన్‌ను కలిపి తెరకెక్కించారు. జోనాథన్ లెవిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో విడుదలైంది. విలియం షేక్స్పియర్ రాసిన రోమియో అండ్ జూలియట్ కథకు జాంబీ టచ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి ఓ జాంబీకి మనిషిపై ప్రేమ ఎలా పుట్టింది ? ఆ ప్రేమ అతడిని తిరిగి మనిషిగా మార్చిందా ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఓ వింత వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. మనుషుల్లో ఎక్కువ మంది జాంబీలుగా మారిపోతారు. ప్రాణాలతో మిగిలిన మనుషులు తమను తాము కాపాడుకోవడానికి ఓ భారీ గోడను నిర్మించుకుని అందులో నివసిస్తుంటారు. మరోవైపు బయట జాంబీల గుంపులు తిరుగుతుంటాయి. అలాంటి జాంబీల్లో ఒకడు ఆర్. అతడికి తన గతం గుర్తుండదు. సరిగ్గా మాట్లాడలేడు. కానీ మిగతా జాంబీలతో పోలిస్తే అతను డిఫరెంట్ గా ఉంటాడు. విమానాశ్రయంలోని ఓ పాత విమానాన్ని తన నివాసంగా మార్చుకుని… అక్కడ ఒంటరిగా జీవిస్తుంటాడు.

Advertisement

ఒకరోజు ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆర్, తన జాంబీ స్నేహితులతో కలిసి కొంతమంది మనుషులపై దాడి చేస్తాడు. ఆ సమయంలో అతను పెర్రీ అనే యువకుడిని చంపి అతని మెదడును తింటాడు. జాంబీలు మనుషుల మెదడును తిన్నప్పుడు వారి జ్ఞాపకాలు కూడా వారికి చేరుతుంటాయి. అలా పెర్రీ జ్ఞాపకాలు ఆర్ లోకి వచ్చిన తర్వాత… అతని గర్ల్‌ఫ్రెండ్ జూలీ గురించి ఆర్ కి తెలుస్తుంది.

జూలీని చూసిన క్షణంలోనే అతనిలో ఊహించని మార్పు మొదలవుతుంది. మిగతా జాంబీలలా ఆమెపై దాడి చేయకుండా, ఆమెను కాపాడాలని నిర్ణయించుకుంటాడు. జూలీ ఒంటికి జాంబీ రక్తాన్ని పూసి, మిగతా జాంబీలకు ఆమె మనిషని తెలియకుండా తన పాత విమానంలోకి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ఓ వింత బంధం మొదలవుతుంది. మొదట ఆర్ ని చూసి భయపడే జూలీ… క్రమంగా అతనిలోని మంచితనాన్ని గుర్తిస్తుంది. ఆర్ కూడా ఆమెతో గడిపే కొద్దీ తనలో ఏదో మార్పు జరుగుతున్నట్లు గమనిస్తాడు. అతని గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలవుతుంది. శరీరంలో కూడా మనిషికి సంబంధించిన మార్పులు కనిపిస్తాయి.

Advertisement

కానీ వీరి ప్రేమకథకు మరో పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. జాంబీల కంటే కూడా భయంకరమైన బోనీస్ అనే జీవులు ఈ ప్రపంచంలో ఉంటాయి. పూర్తిగా కుళ్లిపోయి అస్తిపంజరాలుగా మారిపోయిన ఈ క్రూరమైన జీవులు మనుషులతో పాటు… మళ్లీ మనుషులుగా మారుతున్న జాంబీలను కూడా వదిలిపెట్టవు. మరోవైపు జూలీ తండ్రి ఓ మిలిటరీ లీడర్. జాంబీలను పూర్తిగా నాశనం చేయాలనుకునే అతనికి ఆర్ తన కూతురిని కాపాడుతున్న వ్యక్తి అని తెలుస్తుంది. మరి జూలీ, ఆర్ ల ప్రేమ ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న గోడలను కూల్చగలిగిందా ? ఆర్ తో పాటు మిగతా జాంబీలు కూడా తిరిగి మనుషులుగా మారారా? బోనీస్ నుంచి మనుషులు, జాంబీలు ఎలా బయటపడ్డారు? అన్నదే సినిమా అసలు కథ.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘వామ్ బాడీస్’ ప్రస్తుతం లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV) వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇంగ్లీష్‌లోనే చూడాల్సి ఉంటుంది. మామూలు జాంబీ హారర్ సినిమాల కంటే రొమాన్స్, కామెడీ, ఫాంటసీ, ఎమోషన్ కలిసిన జాంబీ కథలను చూడాలనుకునే వారికి ‘వామ్ బాడీస్’ మంచి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.

Read Also : కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

Related News

చచ్చి బతికి పగ తీర్చుకునే జడ్జి… 10 ఏళ్ల టైమ్ ట్రావెల్‌తో అదిరిపోయే కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులో

17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే

హైవే యాక్సిడెంట్ చూస్తే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ… ఆగితే అస్సలు వదలని దెయ్యం

బోయింగ్ విమానాల్లో ఇంత దారుణమా? వేల కోట్ల కంపెనీ పతనం వెనుక ఉన్న అసలు నిజాలు

తండ్రి దొంగిలించిన డబ్బు కోసం సౌత్ ఆఫ్రికాకు… కోట్ల డబ్బు కోసం అంతర్జాతీయ మాఫియాతో పోరాటం

ఓటీటీ అలర్ట్… ‘ప్రేమలు’ మలయాళం, హిందీ వెర్షన్లు డిలీట్… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?

Big Stories

Advertisement
×