Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబో అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాన్నీ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ముచ్చటగా మూడోసారి ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వెంకీ మామ సినిమా అంటే అది కచ్చితంగా సంక్రాంతి బరిలో ఉండాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా టైటిల్ కు తగ్గట్టే సంక్రాంతి బరిలోకి దిగింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం.. ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. గోదారి గట్టుపై రామచిలకవే.. గోరింటాకెట్టుకున్న చందమామవే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Allu Arjun : బన్నీ లాస్ట్ 5 సినిమాల బిజినెస్… నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ డిమాండ్
మొదటి నుంచి ఈ సాంగ్ పై అనిల్ రావిపూడి అభిమానుల్లో అంచనాలను పెంచేస్తూ వచ్చాడు. దానికి కారణం.. ఈ పాట కోసం సీనియర్ సింగర్ రమణ గోగులను సెలెక్ట్ చేయడమే. రమణ గోగుల పెక్యులర్ వాయిస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు కొత్త కొత్త సింగర్స్ రావడంతో ఆయన సినిమాలకు పాటలు పాడడం తగ్గించాడు.
అనిల్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చాలా స్పెషల్ గా తెరకెక్కిస్తున్నాడు. అందుకే ప్రతిదీ స్పెషల్ గా ఉండాలని.. ఈ సాంగ్ లో చాలా పెక్యులర్ వాయిస్ ఉండాలని రమణ గోగులను తీసుకున్నట్లు ఆయన తెలిపాడు.
Pushpa 2 In AP: పుష్ప-2 హిట్.. అంబటి ప్లాప్.. అరెరె టార్గెట్ మిస్ అయిందే!
ఇక రమణ గోగుల తన కెరీర్ ను వెంకటేష్ సినిమాతోనే మొదలుపెట్టాడు. దాదాపు 18 ఏళ్ల తరువాత మళ్లీ వెంకీ మామ కోసమే రీఎంట్రీ ఇచ్చాడు. చాలా ఏళ్ల తరువాత ఆయన వాయిస్ వినడం సంగీత ప్రియులకు ఆనందంగా ఉంది. భాస్కర భట్ల రవి కుమార్ అందించిన లిరిక్స్ కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఒక ఎత్తు అయితే.. రమణ గోగుల, మధుప్రియ వాయిస్ మరో ఎత్తు.
పెళ్లి అయ్యి, పిల్లలు పుట్టాకా భార్యాభర్తల మధ్య శృంగారానికి కొద్దిగా గ్యాప్ వస్తుంది. అలాంటి సమయంలో పిల్లలకు తెలియకుండా డాబా మీద భార్యపై భర్త తన ప్రేమను, కోరికను వ్యక్తపరుస్తునట్లు లిరిక్స్ ను బట్టి అర్ధమవుతుంది.
ఇక వెంకీ, ఐశ్వర్యల మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా ఉంది. వెంకీ మామ లుక్ కూల్ క్లాస్ గా కనిపిస్తుంది. అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు.. వెంకీ మామ కెరీర్ లో ఎలా నిలిచిపోయిందో.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయన కెరీర్ లో నిలిచిపోయే సినిమా అయ్యేట్లు ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.