BigTV English

Tirumala News: తిరుమల ఇక నో ఫ్లయింగ్ జోన్? కేంద్రానికి లేఖ రాసిన టీటీడీ చైర్మన్..

Tirumala News: తిరుమల ఇక నో ఫ్లయింగ్ జోన్? కేంద్రానికి లేఖ రాసిన టీటీడీ చైర్మన్..

Tirumala News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమల క్షేత్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకున్నారు. ఇప్పటికే తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అన్యమత ఉద్యోగులను పలువురిని రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ పవిత్రతను కాపాడేందుకు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ లేఖ రాశారు.


ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని పండితులు చెబుతుంటారు. అయినప్పటికీ పలుమార్లు విమానాలు ఆలయం పై చక్కర్లు కొట్టిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. తిరుమలకు సమీపంలో రేణిగుంట విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో, ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా స్థానికులు అభిప్రాయ పడే పరిస్థితి. కానీ ఆలయ పవిత్రతను కాపాడేందుకు తిరుమల ఆలయం పై నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఎప్పటి నుండో డిమాండ్ వినిపిస్తోంది. ఆలయం పై విమానం ఎగరడం అపచారంగా భక్తులు భావిస్తారు. అందుకే తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.

తాజాగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ఇదే అంశానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. ఆ లేఖలో తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చైర్మన్ కోరారు. ఆగమశాస్త్రం ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఆయన కోరారు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, ముఖ్యంగా హెలికాప్టర్లు ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. తిరుమల యొక్క సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో ఫ్లయింగ్ జోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని లేఖలో చైర్మన్ పేర్కొన్నారు. అయితే చైర్మన్ లేఖపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తిరుమలను నో ఫ్లై ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తే ఎప్పటినుండో భక్తులు కోరుతున్న డిమాండ్ నెరవేరినట్లని చెప్పవచ్చు.


Also Read: Well Predicts Death: మీ డెత్ డే తెలుసుకోవాలని ఉందా? ఒక్కసారి ఇక్కడికి వెళ్లి వస్తే సరి..
స్థానిక శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మార్చి 02వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా ఈనెల 4 వ తేదీన స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, రంగంలోకి సిట్, మాజీ అధ్యక్షులకు చెమటలు

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×