Crime Thriller OTT: ఓటిటి సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక సినీ దర్శక నిర్మాతలు కూడా ఓటిటిలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి జానర్ లో వచ్చిన సినిమా ఇక్కడ ప్రత్యక్షమవుతుంది.. కొన్ని సినిమాలు అయితే ఏకంగా ఓటీటీలోని రిలీజ్ అవుతూ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమాకు గత ఏడాది నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్న కథతో వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడం విశేషం.. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో రేఖా చిత్రం కూడా ఒకటి.. జనవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఆసిఫ్ అలీ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. జొఫిన్ చాకో సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇదొక మర్డర్ మిస్టరీగా వచ్చిన మూవీ ఇది.. కొత్త కంటెంట్ కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈ మూవీని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పుడు సోనిలీవ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే మరో వారంలో మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఐదు భాషల్లో మార్చి 7న రేఖాచిత్రం మూవీని స్ట్రీమింగ్‍కు తేనున్నట్టు సోనీ లివ్ ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. వణుకు పుట్టించే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. ఓ కేసును విచారించే క్రమంలో 40ఏళ్ల క్రితం జరిగిన హత్య బయటికి వస్తుంది. ఈ కేసుల విచారణలో చాలా మలుపులు ఉంటాయి. ఆసక్తికర కథనంతో, ట్విస్టుల తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ జోఫిన్. ఆసిఫ్, అనస్వర తో పాటు రేఖాచిత్రం మూవీలో సిద్ధిఖీ, మనోజ్ జయన్, జగదీశ్, సాయికుమార్, అశోకన్ వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. ఆత్మహత్య కేసు విచారణలో అతడికి అనూహ్యమైన విషయాలు తెలుస్తాయి. 40 సంవత్సరాల కిందటి నేరంతో లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ఊహించని విషయాలు తెలుస్తుంటాయి. ఈ కేసు దర్యాప్తు ఎలా సాగింది. మొత్తానికి ఈ మూవీ ఆద్యంతం సస్పెన్స్ గా సాగుతుంది.. అస్సలు మిస్ అవ్వకుండా ఇక్కడ ఒకసారి చూసేయ్యండి..