Comedy OTT Movie OTT : మలయాళం ఇండస్ట్రీలో గత ఏడాది వరుసగా వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి చిన్న కంటెంట్తో వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.. ఒక్క మాటలో చెప్పాలంటే గత ఏడాది మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. చిన్న కంటెంట్ తో వచ్చిన సినిమాలు సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక మలయాళ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ మీ అందుకోడంతో పాటుగా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తున్నాయి. ఇక అంతే కాదు ఓటిటి సంస్థలు కూడా మలయాళ సినిమాలని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ ఓటీటిలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదొక హారర్ కామెడీ మూవీ.. ఈ మూవీ పేరేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మూవీ & ఓటీటీ…
గత ఏడాది మలయాళంలో గత ఏడాది చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది హలో మమ్మీ మూవీ. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.. ఈ మూవీ కథ ప్రేక్షకులను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తెలుగులో, తమిళ్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఈ మూవీలో జగదీష్, జానీ ఆంటోనీ కీలక పాత్రల్లో నటించాడు. గత ఏడాది నవంబర్ 21న హలో మమ్మీ మూవీ థియేటర్లలో రిలీజైంది. మొదటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ చివరి వరకు అదే టాక్ తో దూసుకుపోయింది. అలాగే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ కాన్సెప్ట్‌తో పాటు కామెడీ ఆడియెన్స్‌ను మెప్పించింది.. ఇక ఇన్ని నెలల తర్వాత ఈ మూవీ మళ్లీ ఓటీటీ ప్రేక్షకులను నవ్వించేందుకు వచ్చేస్తుంది..
ఈ మూవీ స్టోరీ విషయానికోస్తే..
ఈ మూవీ ఒక కామెడీ, హారర్ మూవీ.. కామెడీ, హారర్ అంశాలకు తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు వైశాఖ్ హలో మమ్మీ మూవీని రూపొందించాడు.. ఐశ్వర్య లక్ష్మీ నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇందులో హీరో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలని అనుకుంటాడు. స్టేఫీ పరిచయంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. స్టేఫీని పెళ్లి చేసుకుంటాడు. చనిపోయిన తన తల్లి ఆత్మ రూపంలో ఇంట్లోనే ఉందనే నిజం పెళ్లైన మొదటి రోజే భర్త బోనీకి చెబుతుంది స్టేఫీ. కానీ బోని మాత్రం అవేవి లేవని లైట్ తీసుకుంటాడు. అలా అతను చేసిన ప్రతిదీ అతనికి రివర్స్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అత్త దెయ్యంగా మారి అల్లుడి పై పతీకారం తీర్చుకుంటుంది. భార్య మాటలను తేలిగ్గా తీసుకుంటాడు బోనీ. ఆత్మ రూపంలో ఉన్న అత్త కారణంగా బోనీ ఎలాంటి కష్టాలు పడ్డాడు? దయ్యం పెట్టి రూల్స్‌ను పాటించాడా? బహోడా అనే తెగ స్టేఫీపై పగను పెంచుకోవడానికి కారణం ఏంటో అన్నది ఈ మూవీలో చూయించారు.. మొత్తానికి ఈ మూవీ ఓటీటీ అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ మూవీని చూసి మీరు కూడా ఎంజాయ్ చెయ్యండి. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మీ సాయి ధరమ్ తేజ్ మూవీలో నటిస్తుంది.