తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలోకెల్లా టాప్ లెవెల్ లో ఉన్న హీరో అంటే అందరికీ ప్రభాస్ (Prabhas) గుర్తుకొస్తారు. మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వీడి మొహానికి హీరో అవుతాడా అని చాలామంది అవహేళనగా మాట్లాడారట. కానీ ప్రభాస్ అవేవీ పట్టించుకోకుండా తాను చేయాల్సిన పని పైన దృష్టి పెట్టి సినిమాల్లో సక్సెస్ అయ్యారు. తను ఒక్కడే ఎదగడమే కాకుండా ఇండస్ట్రీని కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
అలాంటి ప్రభాస్ (Prabhas)కు కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మరి ప్రభాస్ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు రాజమౌళి(Rajamouli) అని చెప్పవచ్చు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారి అదే లెవెల్లో దూసుకుపోతున్నారు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు..
సలార్ 2 కోసం అన్ని సంవత్సరాలు ఆగాలా..?
అయితే ఇదే తరుణంలో సలార్ 2 (Salaar-2) సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో సలార్ 2 సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని, ఇంకా రిలీజ్ అవ్వడానికి మూడు సంవత్సరాలకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు. సలార్-2 శౌర్యాంగ పర్వం 2028లో రిలీజ్ అవుతుందని కూడా కామెంట్లో చేస్తూ ఉండడం గమనార్హం.. అసలు విషయంలోకి వెళ్తే సలార్ మొదటి భాగం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కు మాత్రం నచ్చలేదట. తాను ఆ సినిమాను ఆ రేంజ్ లో ఊహించుకోలేదని, ఇంకో రేంజ్ లో ఊహించానని అందుకే తాను అనుకున్న రిజల్ట్ రాలేదని ఆయన చాలా బాధపడ్డారట. కానీ ఆ కోరికను సలార్ -2 ద్వారా తీర్చుకోవాలని అనుకుంటున్నారు. సలార్-1 లో మిస్ అయినటువంటి చాలా ఎలిమెంట్స్ సలార్-2 లో యాడ్ చేయబోతున్నారట. ఇదే తరుణంలో సలార్-2 రిలీజ్ అవ్వడానికి ఇంకా మూడేళ్ల సమయం పట్టవచ్చు అని,దీనికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)తో ఒక మూవీ చేస్తున్నాడు.
ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్..
ఎలాగైనా ఈ ఏడాది ఆ చిత్రాన్ని పూర్తి చేసి, 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తానని ఆయన ఎప్పటినుంచో అంటున్నారు. కానీ అనుకున్నంత సమయంలో సినిమా పూర్తి అయ్యే విషయం అయితే కనిపించడం లేదు. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ ఎన్నో చిత్రాలు తీశారు. కానీ అనుకున్న టైంలో ఏ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయలేదు. ఆ విధంగానే ఎన్టీఆర్ తో సినిమా కూడా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆ చిత్రం లేట్ అయితే సలార్ -2(Salaar-2) చిత్రం ఎప్పుడు చేస్తారు..? ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అనే అంశాలపై చాలా కన్ఫ్యూజన్ నెలకొనింది. ఇదే తరుణంలో సలార్ 2 రిలీజ్ డేట్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికైతే సలార్ 2 సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా మూడేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.